ఆండ్రాయిడ్ 11తో రానున్న 8 అద్భుతమైన ఫీచర్లు ఇవే

ఆండ్రాయిడ్ 11తో రానున్న 8 అద్భుతమైన ఫీచర్లు ఇవే

ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టంను గూగుల్ అధికారికంగా లాంచ్ చేసింది. దీనికి సంబంధించిన అప్ డేట్లు కూడా రావడం మొదలైంది. గూగుల్ పిక్సెల్ ఫోన్లకు ఇప్పటికే ఆండ్రాయిడ్ 11 అందుబాటులోకి రాగా, వన్ ప్లస్, షియోమీ, రియల్ మీ వంటి ఇతర కంపెనీలకు ఫైనల్ బీటా వెర్షన్ అందుబాటులోకి వచ్చింది. ఆండ్రాయిడ్ 11లో ఎనిమిది అద్భుతమైన ఫీచర్లను కంపెనీ అందించింది. ఈ ఆపరేటింగ్ సిస్టం ద్వారా మీరు రెగ్యులర్ గా చాట్ చేసే వారితో చాటింగ్ ఇక మరింత సులభం కానుంది. చాట్ బబుల్స్ ద్వారా మల్టీ టాస్కింగ్ ద్వారా చేయవచ్చు. వీటిని మీరు సేవ్ చేసుకుని తర్వాత నోటిఫికేషన్లలో చూడవచ్చు. ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టంలో డిఫాల్ట్ స్క్రీన్ రికార్డర్‌ను అందించనున్నారు. రిఫైన్డ్ మీడియా కంట్రోలర్ కూడా ఇందులో ఉంది. నేటివ్ స్మార్ట్ హోం కంట్రోల్స్ కూడా ఇందులో ఉన్నాయి. యాప్స్ కు పర్మిషన్లు కేవలం వాటిని ఉపయోగించేటప్పుడు మాత్రమే ఇచ్చేలా చేయవచ్చు. సెక్యూరిటీ అప్ డేట్లు ఏకంగా గూగుల్ ప్లేస్టోర్ నుంచే రానున్నాయి.