NO లాక్ డౌన్ బ్రేక్. హీరో విజయ్ దేవరకొండ

NO లాక్ డౌన్ బ్రేక్. హీరో విజయ్ దేవరకొండ

కరోనా, లాక్ డౌన్ నేపథ్యంలో విధి నిర్వహణలో ఉంటున్న హైదరాబాద్ పోలీసులకు ఫేస్ ప్రొటెక్షన్ షీల్డ్ లను అందజేసింది డాక్టర్స్ అసోసియేషన్. ముఖ్య అతిథిగా హాజరై ఫేస్ ప్రొటెక్షన్ షీల్డ్స్ ను ఆవిష్కరించారు హీరో విజయ్ దేవరకొండ.

ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ:
“మనస్పూర్తిగా తెలంగాణ పోలీస్ ను అభినందిస్తున్నాను.24 గంటలు పోలీసులు మనకోసం పని చేస్తున్నారు. నేను బయటికి వచ్చి 20 రోజులు అయింది.లాక్ డౌన్ ఇంత విజయవంతం అవుతుంది అంటే, అది పోలీస్ , మన ప్రభుత్వం తోనే సాధ్యం అయ్యింది.ప్రజలు అందరూ ఇళ్లల్లోనే ఉండండి.టైమ్ పాస్ కోసం రోడ్ల మీదకు వచ్చి లాక్ డౌన్ బ్రేక్ చేయవద్దు.త్వరలోనే ఈ పరిస్థితి నుండి బయటపడతాం అనే నమ్మకం ఉంది.తెలంగాణ డాక్టర్స్ ఫెడరేషన్ వారు పోలీస్ లకు ప్రొటెక్షన్ కిట్లు ఇస్తున్నందుకు సంతోషంగా ఉంది.