హాట్ ఫోటోల్లో పాయ‌ల్ రాజ్ పుత్

పాయ‌ల్ రాజ్ పుత్ పేరు విన‌గానే ‘Rx 100’ సినిమాలో ఆమె చేసిన ర‌చ్చ గుర్తుకు వ‌స్తోంది. పాయల్ రాజ్ పుత్… ‘Rx 100’ సినిమా ద్వారానే తెలుగు తెరకు పరిచయమైంది. ఈ సినిమాలో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి మంచి గుర్తింపుని తెచ్చుకుంది. ఈ చిత్ర విజయంతో ఎక్కడికో వెళ్ళుపోతుందనుకున్న పాయల్ కు నిరాశే ఎదురైంది. పెద్ద పెద్ద ఆఫర్స్ వస్తాయనుకున్న పాయల్ కు ‘RDX 100’ లాంటి చిన్న చిన్న చిత్రాల్లో నటించే అవకాశం మాత్రమే దక్కింది. ‘RDX 100’ సినిమాలో ‘Rx 100’ ని మించి అందాలను ఆరబోసినప్పటికీ క్రేజీ ప్రాజెక్టులు మాత్రం దక్కించుకోలేకపోయింది.

అలాంటి టైంలో అనుకోకుండా వెంకీతో నటించే అవకాశం ‘వెంకీమామ’ సినిమా రూపంలో అమ్మడి తలుపు తట్టింది. బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాతోనైనా టాలీవుడ్ లో పాగా వేద్దామనుకున్న ఈ భామకు మళ్ళీ నిరాశే ఎదురైంది. ఈ చిత్రంలో తన నటనకు మంచి మార్కులే పడినప్పటికీ అవకాశాలు మాత్రం రాలేదు. రవితేజ సరసన ‘డిస్కోరాజా’ సినిమాలో నటించినప్పటికీ మళ్ళీ పరాజయం పలకరించింది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్ గా ఉండే పాయల్ తన హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ ఉంటుంది.

లాక్ డౌన్ సమయంలో ఇంటికే పరిమితమైన పాయల్ అందరు సెలెబ్రెటీలలాగే తన ఫొటోలతో సోషల్ మీడియాను హోరెత్తిస్తోంది. ఇప్పుడు లేటెస్ట్ గా నేను ఉన్నానంటూ గుర్తు చేయడానికి ఓ హాట్ ట్రెండీ ఫొటోతో నెటిజన్ల ముందుకొచ్చింది. ఈ ఫొటోలో తన పింక్ కలర్ టాప్ ని పైకి లేపి ఆమె నాభి అందాలను చూపిస్తూ కుర్రకారుని రెచ్చగొడుతోంది. గ్లామర్ డోస్ పెంచి దర్శక నిర్మాతలకు అందాల బాణాలు విసురుతున్నట్లుంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం పాయల్ హాట్ ఫొటోస్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్నాయి. ఈ ఫోటోలపై నెటిజన్లు తమకు నచ్చిన విధంగా కామెంట్స్ చేస్తూ రెచ్చిపోతున్నారు. ఏదేమైనా ఫ్యాన్స్ కు సొగసుల విందును వడ్డిస్తూ అందాలను ఆరబోస్తున్న పాయల్ రాజ్ పుత్ కు ఈ ఫోటోలను చూసైనా మంచి అవకాశాలు దక్కాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు.