పూజా హెగ్డే..బిజిబిజీ

పూజా హెగ్డే..బిజిబిజీ

టాలీవుడ్‌లో వ‌రుస హిట్ల‌తో దూసుకుపోతున్న భామ‌
అగ్ర హీరోల సర‌స‌న ది బెస్ట్ అప్ష‌న్ గా.. పూజాహెగ్డే
ఒక లైలా కోసం సినిమాతో తెలుగు తెర‌కు ప‌రిచ‌యం
అల వైకుంఠ‌పురం హిట్‌న్ త‌న ఖాతాలో వేసుకున్న పూజా
-పూజా హెగ్డే.. నాగ చైతన్య హీరోగా నటించిన ‘ఒక లైలా కోసం’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన ఈ భామ.. ఆ తర్వాత వరుణ్ హీరోగా పరిచయమైన ‘ముకుందా’ సినిమాలో గోపికమ్మ పాటతో ఈ భామ క్రేజ్ పెరిగింది. ప్రస్తుతం అగ్ర హీరోల బెస్ట్ ఆప్షన్‌గా నిలిచిన పూజా హెగ్డే తాజాగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘అల వైకుంఠపురములో’ సినిమాతో మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది.

పూజా పుట్టింది..ముంబ‌య్‌:
– పూజా హెగ్డే అక్టోబరు 13, 1990న ముంబై లో జన్మించింది. తల్లిదండ్రులు మంజునాథ్ హెగ్డే, లతా హెగ్డే. పూజా పుట్టింది ముంబై అయిన తల్లిదండ్రుల స్వస్థలం కర్ణాటకలోని లోని మంగుళూరు. పూజా హెగ్డే మాతృభాషలు ఇంగ్లీష్, హిందీ, మరాఠీ, కొద్దిగా కన్నడ, తమిళ్ కూడా మాట్లాడుతుంది. అంతేకాదు పూజా భారతనాట్యంలో కూడా శిక్షణ పొందింది.

నేప‌థ్యం:
– పూజా తండ్రి మంజునాధ్ హెగ్డే వ్యాపార వేత్త. తల్లి లత హెగ్డే క్యూ నెట్ వర్క్ మార్కెటింగ్ బిజినెస్ నిపుణురాలు. దాంతో చిన్నప్పటి నుంచి నెట్ వర్క్ మార్కెటింగ్ లో పూజా మెళుకువలు బానే అలవర్చుకుంది. . ముంబై లోని ఎంఎంకే కాలేజ్‌లో కామర్స్ లో ఉన్నత విద్య చదివిన ఈ సుందరి. ఇంటర్ కాలేజ్ ప్రోగ్రామ్స్ లో, డాన్స్ షోస్ లో ఇంకా ఫ్యాషన్ షోలో పాల్గొనేది.

మిస్ ఇండియాలో రెండో స్థానం:
– పూజా మిస్ ఇండియా పోటీలలో 2009 లో పాల్గొన్నా మొదటి రౌండ్స్ లోనే ఎలిమినేట్ అయిపోయింది. అయితే 2010 లో విశ్వసుందరి పోటీలకు భారతదేశం నుంచి ఎంపిక కోసం జరిగిన అందాల పోటీల్లో రెండో స్థానంలో నిలిచింది. బిర్యానీ, పిజ్జా లను ఎక్కువగా ఇష్టపడే పూజ కనీసం రోజూ రెండు గంటలు యోగా, వర్కౌట్స్ కు కేటాయిస్తుంది. తన బరువును ఎప్పుడు కంట్రోల్ లో ఉంచుకొనే ఈ బ్యూటీ బరువు 53 కేజీలు, ఎత్తు 5 అడుగుల 9 అంగుళాలు.

జెన్నిఫర్ లోపెజ్ పాటలకు పిచ్చ ఫ్యాన్:
– క్రికెటర్ రాహుల్ ద్రావిడ్, టెన్నిస్ స్టార్ రోజెర్ ఫెదరర్ ను ఆరాధించే పూజా ఏ ఆర్ రెహ్మాన్ సంగీతానికి, జెన్నిఫర్ లోపెజ్ పాటలకు పిచ్చ ఫ్యాన్. ఇంకా హృతిక్ రోషన్, అమీర్ ఖాన్ సినిమా పరంగా ఎక్కువగా ఇష్టపడుతుంది. ఖాళీ సమయాలలో డాన్స్, పుస్తకాలు చదవడం, ట్రావెలింగ్ ఎక్కువగా చేసే పూజా పెడ్రో అనే కుక్కను కూడా పెంచుతోంది. ఖాళీ దొరికినప్పుడు మూగ జీవాలకు సేవ కూడా చేస్తుంటుంది.

క‌ష్టం వ‌స్తే ఏడుపే ఏడుపే:
– పూజాకు ఏదైనా కష్టం వచ్చినపుడు 15 నిముషాలు ఏడుస్తుందట, ఎందుకంటే ఆ తరువాత ఆ కష్టం నుంచి వచ్చే నెగెటివ్ థాట్స్ అన్ని పోతాయని త‌న అభిప్రాయం. తాను అమితంగా ఇష్టపడే ఓప్రా విన్ ఫ్రే నుంచి ఈ టెక్నిక్ నేర్చుకుందట ఈ బ్యూటీ. ఈ టెక్నీకే తనను స్టార్‌ను చేసింది అని చెప్పుకుంటుంది. ఖరీదైన‌ వస్తువులు, బట్టల్ని ఇష్టపడే పూజా ఎక్కువగా షాపింగ్ చెయ్యదు, కానీ చేస్తే తన టేస్ట్ కు తగ్గట్టు అన్నీ కోనేస్తుంది. అయితే ఎప్పుడూ ఫ్యాషన్ గా ఉండడానికే ఇష్టపడుతుంది.