భర్తను దూరం పెట్టిన శ్రీయ.. కారణం???

కరోనా దెబ్బకు సెలబ్రిటీలు, సామాన్యులు అనే తేడా లేకుండా అంతా బెంబేలెత్తిపోతున్నారు. సెలబ్రిటీలు సైతం… కరోనా నుంచి తమను తాము రక్షించుకునేందుకు ఇంటికే పరిమితమవుతున్నారు. అయితే కొందరు సెలబ్రిటీలను మాత్రం కరోనా టెన్షన్ పెడుతోంది.

తాజాగా తన భర్త ఆండ్రీకి కరోనా లక్షణాలున్నాయని కథానాయిక శ్రియ పేర్కొన్నారు. పొడి దగ్గు, జర్వంతో బాధపడుతున్నాడని ఓ ఆంగ్లపత్రికతో అన్నారు. రష్యాకు చెందిన క్రీడాకారుడు ఆండ్రీని శ్రియ 2018 మార్చిలో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత కూడా ఆమె నటిగా సినీ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం భర్తతో కలిసి స్పెయిన్‌లో ఉంటున్నారు. ఆ దేశంలో కూడా కరోనా వైరస్‌ విజృంభిస్తుండటంతో లాక్‌డౌన్‌ విధించారు. గత కొన్ని రోజులుగా శ్రియ క్వారంటైన్‌లో ఉంటున్న వీడియోలు, ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా షేర్‌ చేస్తున్నారు. ఇంట్లో సమయం గడపడం ఎంతో నచ్చిందని పేర్కొన్నారు.