కాశీలోని తెలుగు యాత్రికులు స్వస్థలాలకు..

కరోనా లాక్ డౌన్ కారణంగా దేశంలో ప్రజలందరూ ఎక్కడికక్కడ ఉండిపోవాల్సిన్ పరిస్థితుల్లో వారణాసి నుండి తెలుగు రాష్ట్రాలకు 1000 మంది యాత్రికులు స్వస్థలకు బయలుదేరారు. BJP రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు చొరవతో లాక్-డౌన్ విధించడానికి ముందు వారణాసి యాత్రకు వెళ్లి చిక్కుకుపోయిన వీరందరి ప్రయాణం కోసం అనుమతి లభించింది. గత కొన్ని రోజులుగా అక్కడ కాశీలో వసతి, ఆహార సౌకర్యాలు కల్పించేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంతో మాట్లాడి MP GVL ప్రత్యేక చర్యలు తీసుకున్నారు.

ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం మరియు వారణాసికి చెందిన అధికారులతో సమన్వయం చేస్తూ గత నెల 22వ తేదీ నుంచి తెలుగు ప్రజల యోగక్షేమ సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వారికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా జీవిఎల్ నరసింహారావు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయ అనుమతితో జీవిఎల్ నరసింహారావు ఆదివారం 1000 మంది తెలుగు యాత్రికులను తమ తమ నివాసాలకు తీసుకు వచ్చేందుకు చర్యలు చేపట్టారు. ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసి రెండు తెలుగు రాష్ట్రలకూ యాత్రికులను పంపుతున్నారు.

యాత్రికులు అందరూ స్వస్థలాలకు చేరే వరకు ప్రయాణించే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను, రాష్ట్రంలోని వారు ఉన్న జిల్లాలోని అధికారులను సమన్వయం చేస్తున్నామని జీవీఎల్ నరసింహరావు తెలిపారు.