హైటెక్ మాయా మజాకా

హైటెక్ మాయా మజాకా

చిత్తూరు జిల్లా పలమనేరు మండలం వీకోటలోని లాడ్జిలో యధేఛ్చగా జరుగుతున్న వ్యభిచార ముఠా గుట్టు ఇటీవల పోలీసులు రట్టు చేసిన సంగతి తెలిసిందే. కొంతమంది వ్యభిచార నిర్వాహకులు సంఘంలో మంచి వారిలా చెలామణి అవుతూ రహస్యంగా హైటెక్ వ్యభిచారాన్ని నిర్వహిస్తున్నట్టు సమాచారం. వీరి మాయమాటలను నమ్మి పలువురు కళాశాలకు వచ్చే విద్యార్థులు సైతం ఈ ఊబిలో పడినట్టు చర్చించుకుంటున్నారు. టెక్నాలజీ సాయం తో అనేక లాడ్జీలు హోటళ్లను కేంద్రంగా చేసుకుని హైటెక్ వ్యభిచారం జోరుగా సాగిస్తున్నారు. సోషల్మీడియాలో యాక్టివ్గా ఉండే అమ్మాయిలను ఎంచుకుని వారిని మాయమాటల తో మభ్యపెట్టి సెక్స్వర్కర్లుగా మారుస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. వ్యభిచారం చేస్తే సులువుగా డబ్బు సంపాదించుకోవచ్చని లగ్జరీగా బ్రతకొచ్చంటూ టీనేజీ అమ్మాయిలకు వల వేస్తున్నారు.

ప్రస్తుతం అందరి దగ్గర..స్మార్ట్ ఫోన్స్ ఉండటం తో ఆ ఫోన్స్ ను ఉపయోగించుకొని మొదట సోషల్ మీడియా ద్వారా అమ్మాయిల తో పరిచయాలు పెంచుకుని వారి స్ధితి గతులు తెలుసుకుని ఆపై ఈజీ మనీ కోసం ఈ ఊబిలోకి వారిని దించుతున్నట్టు తెలుస్తోంది. పలమనేరునియోజవర్గంలో జరుగుతున్న వ్యభిచార దందా మూలాలు పలమనేరు కేజీఎఫ్ బెంగళూరులో ఉన్నట్టు తెలిసింది. సోషల్మీడియాను వేదికగా చేసుకుంటున్న కొందరు అక్రమార్కులు టీనేజీ అమ్మాయిలకు మాయమాటలు చెప్పి లొంగదీసుకుని సెక్స్రాకెట్లో ఇరికిస్తున్నట్లు తెలుస్తోంది. ఫేస్బుక్ టిక్ టాక్ వంటి సోషల్మీడియా యాప్ల ద్వారా పరిచయం పెంచుకుని వివరాలు తెలుసుకుని బెదిరింపులకు దిగుతున్నారు. ఆర్థిక పరిస్థితులు సరిగ్గా లేని కుటుంబాలకు చెందిన యువతులను డబ్బు ఆశ చూపించి సెక్స్వర్కర్లుగా మారుస్తున్నారు. అలా మెల్లమెల్లగా వారిని వ్యభిచార కూపంలోకి దించుతున్నారు. ఒక్కసారి ఇందులోకి దిగినవారు బయటకి వద్దామనుకున్న కూడా మళ్లీ బయటకు రావడం కష్టమే.