మద్యం హోం డెలివరీ వచ్చేసింది

దేశంలో తొలిసారిగా నేటి నుంచి మద్యాన్ని హోం డెలివరీ పంజాబ్‌ రాష్ట్ర ఎక్సైజ్‌ అండ్‌ టాక్సేషన్‌ శాఖ చేయబోతోంది. కరోనా కట్టడి కోసం లిక్కర్ దుకాణాల ఎదుట కిలో మీటర్ల క్యూలు ఉండకుండా భౌతిక దూరం ఉండాలంటే లిక్కర్‌ డెలివరీ చేయాల్సిందేనని ఉద్దేశ్యంతో సంబంధిత శాఖ కమిషనర్లు డెలివరీ సమయాన్ని నిర్ణయిస్తున్నారు.

ఈ డెలివరీ సమయంలో ఒక్కో ఇంటికి 2లీటర్ల మద్యం మాత్రమే ఇవ్వనున్నారు. 21 ఏళ్ల వయసు పూర్తయిన వ్యక్తులకు మాత్రమే మద్యం డెలివరీ చేసేలా నిర్ణయం తీసుకున్నారు.

అలాగే పశ్చిమ బెంగాల్‌ రాష్ట్ర ప్రభుత్వం అనుమతితో రాష్ట్ర బేవరేజెస్‌ కార్పొరేషన్‌ ఓ వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. మద్యం షాపుల ఎదుట జనాల క్యూలు తగ్గించేందుకే ఈ విధానాన్ని మమతా సర్కారు ప్రారంభించింది. ఓ వైపు దేశ వ్యాప్తంగా మద్యం కొనుగోళ్ల కోసం జాతరలా జనం ఎగబడుతుండటంతో హోం డెలివరీ వ్యవస్థను ముందుకు తీసుకు వచ్చారు. రాబోయే రోజుల్లో దేశ వ్యాప్తంగా అమలు అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కానీ మందుబాబులు మాత్రం ఈ హోం డెలివరీ వ్యవస్థను ఆహ్వానిస్తున్నారు.