కోవిడ్19 వ్యాప్తి నియంత్రించేందుకు కీలక సమావేశం

కోవిడ్19 వ్యాప్తి నియంత్రించేందుకు కీలక సమావేశం

భారత్ దేశంతో సరిహద్దు పంచుకుంటోన్న నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, మయన్మార్ దేశాలతో రాష్ట్రాలు కోవిడ్19ను ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉండేలా జాగ్రత్తల కోసం
కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా సమీక్షించారు. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, బీహార్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్,మిజోరాం, మణిపూర్, త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులు,అదనపు ప్రధాన కార్యదర్శులు, ఇతర ఉన్నతాధికారులు వీడియో కాన్ఫరెన్స్ సమీక్షలో పాల్గొన్నారు. వివిధ ట్రాన్సిట్ పాయింట్ల వద్ద వైద్యులచే స్క్రీనింగ్ నిర్వహిస్తున్నట్టు ఆ రాష్ట్రాల అధికారులు తెలిపారు.
సరిహద్దు ప్రాంతాల్లో వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలను గ్రామ సభల ద్వారా అప్రమత్తం చేస్తున్నామని పేర్కొన్నారు. వంద శాతం స్క్రీనింగ్ జరిగేందుకు వీలుగా పరీక్ష సామగ్రిని ఇతర వైద్యపరికరాలను, వైద్యులను 24 గంటలూ అందుబాటులో ఉంచాలని అధికారులకు హోం  శాఖ కార్యదర్శి సూచించారు.