దేశంలో కరోనా హాట్‌స్పాట్‌లు? కరోనా జోన్లు?

దేశంలో 170 జిల్లాల హాట్‌స్పాట్‌లను ప్రకటించారు. 207
నాన్ హాట్‌స్పాట్‌లుగా కూడా గుర్తించామని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. COVID-19 హాట్‌స్పాట్‌లు మరియు గ్రీన్ జోన్‌లు గుర్తించబడ్డాయి. హాట్‌స్పాట్లలో ఇంటింటికి సర్వేలు జరుగుతున్నాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

దేశంలోని జిల్లాలను 3 వర్గాలుగా విభజించారు. పూర్రి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి. 

1. హాట్ స్పాట్ జిల్లాలు
2. నాన్-హాట్ స్పాట్ జిల్లాలు
3. గ్రీన్ జోన్ జిల్లాలు

భారతదేశంలో ఇప్పటివరకు కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ లేదని ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ప్రత్యేక బృందాలు ఎవరికైనా COVID-19 సోకిందా అనే కేసుల కోసం శోధిస్తున్నాయి. అలాగే ప్రమాణాల ప్రకారం నమూనాలను సేకరించి పరీక్షలు చేస్తున్నామన్నది కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.అత్యవసరమైన సేవలకు సంబంధించినవి తప్ప, కంటైన్ మెంట్ జోన్లలో సడలింపులు, అనుమతులు ఉండవని తేల్చింది.

కేంద్ర ప్రకటన..

తెలుగు రాష్ట్రాల్లో హాట్ స్పాట్ జిల్లాలివే

దేశవ్యాప్తంగా  170 జిల్లాలను కరోనా హాట్‌స్పాట్‌లుగా, 207 జిల్లాలను నాన్ హాట్‌స్పాట్‌లుగా, మిగిలినవాటిని గ్రీన్ జోన్లుగా  గుర్తించినట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ

ఏపీలో హాట్ స్పాట్ (లార్జ్ ఔట్‌బ్రేక్)
జిల్లాలు: కర్నూలు, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం, కృష్ణ, కడప, పశ్చిమ గోదావరి, చిత్తూరు, విశాఖపట్నం, తూర్పు గోదావరి, అనంతపూర్

తెలంగాణలో హాట్ స్పాట్ (లార్జ్ ఔట్‌బ్రేక్)

జిల్లాలు: హైదరాబాద్, నిజామాబాద్, వరంగల్ అర్బన్, రంగారెడ్డి, జోగులాంబ గద్వాల్, మేడ్చల్-మల్కాజిగిరి, కరీంనగర్, నిర్మల్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో హాట్ స్పాట్స్ వివరాలు కింద చదివి తెలుసుకోగలరు.