దేశమంతటా ఎంతమందికి వైద్యరంగంలో కరోనా సోకింది? వివరాలు

కరోనా మహామ్మారిని ఎదుర్కొనేందుకు రక్షణ కవచంలా ముందుండి మన వైద్యులు, వైద్య సిబ్బంది పోరాడుతున్నారు. దేశమంతటా అందుకే ప్రజలందరూ వైద్య రంగ బృందాలకు నీరాజనాలు పడుతున్నారు. కానీ మరోవైవు ఈ కరోనా యోధుల స్థితిగతులు పరిశీలిస్తే కేంద్రం సేకరించిన సమాచారం ప్రకారం దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 548 మంది వైద్యులు, నర్సులు, పారామెడిక్స్ సిబ్బందికి కరోనావైరస్ పాజిటివ్ సోకినట్లు నిర్దారణ అయింది. అంటే వీరోచిత పోరాట యోధులను కూడా కోవిడ్19 పట్టి పీడిస్తోంది. ఏమైనా మన భారతదేశంలో వైద్యో నారాయాణో హరి సేవలు సువర్ణ అక్షరాలతో చరిత్రలో లిఖించబడతాయి.