రోగనిరోధక శక్తిని పెంచడం ఎలా?? WHO

ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనల ప్రకారం ఆరోగ్యంగా ఉండడం అంటే శారీరకంగా, మానసికంగా మరియు సాంఘికంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండటం. కేవలం వ్యాధులు లేకుండా ఉండటం మాత్రమే కాదు. మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని మరియు రక్షణ వ్యవస్థను అభివృద్ధి చేసుకోవడం నిజమైన ఆరోగ్యం. ఆరోగ్యమే మహా భాగ్యం.

ప్రతి రోజు మానవ శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుకునేందుకు ఆరోగ్యకరమైన పోషకాహారం తీసుకోవడం చాలా అవసరం. అసాధారణమైన మరియు కాలనుగుణ వ్యాధులు, వైరస్ మహామ్మారిల నుంచి రక్షణ కొరకు సరైన పోషకాహారం తీసుకోవడం తప్పనిసరి. మన వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవడం ఏ ఒక్క పదార్థంతో సాధ్యపడదు. అందుకే మనలో వ్యాధి నిరోధక శక్తి పెంచే పోషక ఆహార అలవాట్లు మనమిప్పుడు తెలుసుకుందాం.

పోషక పదార్థాలు ముఖ్యం:
మానవ శరీరం వ్యాధి నిరోధక శక్తిని పెంచుకునేందుకు వివిధ రకాలైన పోషక పదార్థాలు తీసుకోవడం ఉత్తమం. దీంతో జబ్బులు నయం కావడం మరియు మనం ఆయురారోగ్యాలతో యథాస్థితికి రావడం అనేది త్వరగా సాధ్యపడుతుంది. అందుకే ప్రతి రోజు క్రమం తప్పకుండా అధిక శాతం పోషకాలున్న పాలు, ధాన్యాలు, చికెన్, చేపలు మరియు గుడ్లు, కూరగాయలు విరివిగా మన భోజనము మెనులో ఉండేలా చూసుకోవాలి. మనమందరం ప్రతి రోజు మూడు పూటలా భోజనంలో కనీసం 20 నుంచి 30 గ్రాముల పోషక పదార్థాలను చేర్చుకోవడం చాలా అవసరం.

పోషక పదార్థాలు మరియు ఖనిజాలు లభించే పదార్ధాలు అత్యధికంగా మనం ఇష్టపడితే మనకు చాలా ఆరోగ్యకరం.
విటమిన్ ఎ: పసుపు వర్ణపు పళ్ళు, చిలగడదుంప మరియు బత్తాయి పళ్ళు (మామిడి బత్తాయి మరియు క్యారెట్).

విటమిన్ సి: నిమ్మ జామ టమాటో మరియు ఉసిరి.
మనం రోజు తినే ఆహారంలో భాగంగా ఒకటి లేదా రెండు కాలానుగుణంగా వచ్చే పండ్లను చేర్చుకోవడం చాలా ఉపయోగకరం.

విటమిన్ డి: సూర్యరశ్మి ద్వారా విటమిన్ డి బాగా లభిస్తుంది. బలవర్ధకమైన పాల పదార్ధాలు గుడ్డులోని పచ్చసొన మరియు మాంసం వంటి కొన్నింటి ద్వారా మాత్రమే విటమిన్ డి లభిస్తుంది.

జింక్: ఎక్కువ పోషక విలువలు కలిగిన గుడ్లు, పాలు మరియు గింజలలో జింక్ ఎక్కువగా లభ్యమవుతుంది. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లలో బాగంగా విటమిన్ బి6, బి12 ఇనుము, కాపర్, సెలీనియం వంటివి వ్యాధి నిరోధకశక్తిని అభివృద్ది చేసే పదార్థాలను తినడంలో అలవాటు చేసుకోవాలి.

అత్యధికంగా మనం తప్పకుండా ఇంట్లో భోజనానికే ప్రాధాన్యత ఇవ్వాలి. మన ఇంట్లో తయారు చేసిన ఆహార పదార్థాలు తినడం వల్ల శరీరంలో వ్యాధి నిరోధక శక్తి మరియు రక్షణ వ్యవస్థ బాగా అభివృద్ధి చెందుతాయి. మన భారతీయులు అందరూ ఆహార తయారీలో ఉపయోగించే ముఖ్య పదార్థాలైన పసుపు, అల్లం, వెల్లుల్లి మరియు మిరియాలు వంటి పదార్థాలు జీర్ణక్రియకు తోడ్పాటు అందించడమే కాకుండా మంచి వ్యాధి నిరోధక శక్తిని అభివృద్ధి చేస్తాయి.

జలీకరణము:
కొబ్బరి నీరు, మజ్జిగ వంటివి శరీరంలో ఉష్ణోగ్రతను అదుపులో ఉంచుతాయి. ఒత్తిడి లేకుండా మరియు నిద్ర సరిగా పోవాలంటే వీటిని అదుపులో ఉంచుకోవడం వల్ల హార్మోనుల సంతుల్యత సాధ్యపడుతుంది.

ఈ కరోనా మహామ్మారి సమయంలోనే కాకుండా ఎప్పటికి మన ఆహార అలవాట్లను శుభ్రంగా మన ఇంట్లో చేసే పదార్థాలకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందనేది గుర్తిచండి. అలాగే జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, పిజ్జాలు, బర్గర్లు, రోడ్లపై దొరికే చెత్త చెదారం పొట్టలోకి వేయకపోతే అక్కడే మీరు సగానికి పైగా రోగ నిరోధక శక్తిని మీ శరీరంలో సంపాదించుకునే వాళ్ల శాతంలోకి చేరిపోతారు. క్రమం తప్పకుండా ఈ ఆహారపు అలవాట్లను అలవరుచుకోవాలని డాక్టర్ వరుణ్, MBBS, DNB, CTVS (కార్డియాక్ సైన్సెస్ స్పెషలిస్ట్) ప్రజలందరికి విజ్ఞప్తి చేస్తున్నారు.