మంచు దుప్పట్లో హిమాచల్ ఆందోళనలో ఉత్తరాది, కోవిడ్19 కారణం

మంచు దుప్పట్లో హిమాచల్ ఆందోళనలో ఉత్తరాది, కోవిడ్19 కారణం

ఉత్తర భారతదేశంలో చల్లగాలులు ప్రజలను తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి కారణం ఒక్కటే కోవిడ్19. ఎందుకంటే వాతావరణం చల్లగా ఉండే ప్రదేశాల్లో కోవిడ్19 విశ్వరూపం చూపుతుందేమోనని భయం. ఇప్పటికే పశ్చిమ దేశాలు చల్లని వాతావరణం, గాలులు కారణంగా ఇటలీ, స్పెయిన్, UK ఇతర యూరప్ దేశాల్లో కోవిడ్19 మహమ్మారి తీవ్ర ప్రభావం చూపుతోంది. మనదేశంలో హిమాలయాల్లో మంచు కురియడం కారణంగా ఉత్తర భారతదేశ రాష్ట్రాల్లో వాతావరణం శనివారం నుంచి ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ఏకంగా శనివారం వడగళ్ల వర్షం కురిసిందంటే అర్థం చేసుకోవచ్చు వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు చోటు చేసుకోవడం. ఇవాళ హిమాచల్ ప్రదేశ్ లాహోల్ స్పితి జిల్లాల్లో మంచు దుప్పటి పరుచుకు పోయింది. రోహతంగ్, కులూ మానాలీలో కూడా చల్లగా వాతావరణం నమోదవడంతో ఆ ప్రభావం ఉత్తరాది రాష్ట్రాల్లో పడుతోండటంతో ప్రజలు కొంత భయాందోనలో ఉన్నారు.