రెడ్ సినిమా శాటి లైట్ హక్కులకు భారీ రేటు

రెడ్ సినిమా శాటి లైట్ హక్కులకు భారీ రేటు

‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా తర్వాత యంగ్ హీరో రామ్ నటిస్తున్న చిత్రం ‘రెడ్’. కిషోర్ తిరుమల దర్శకత్వంలో శ్రీ స్రవంతీ మూవీస్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఓటీటీ నుంచి డైరెక్టు రిలీజ్ కోసం ఆకర్షణీయమైన ఆఫర్లు వచ్చినప్పటికీ నిర్మాత ఇవ్వలేదు. హీరో రామ్ థియేటర్లలోనే రిలీజ్ చేయాలన్న పట్టుదలతో ఉండడంతో ఆ ఆఫర్లను తిరస్కరించారు.ఇక ఈ చిత్రాన్ని సంక్రాంతికి థియేటర్లలో రిలీజ్ చేయనున్నట్టు నిన్న చిత్ర నిర్మాత అధికారికంగా ప్రకటించడం కూడా జరిగింది. ఇదిలావుంచితే, ఈ చిత్రానికి సంబంధించిన శాటిలైట్, డిజిటల్ హక్కులకు మంచి ఫ్యాన్సీ రేటు పలికినట్టు తెలుస్తోంది. 13.5 కోట్లు ఆఫర్ చేసి ఆ హక్కులను జెమినీ టీవీ సొంతం చేసుకున్నట్టు చెబుతున్నారు. ఈ కోవిడ్ రెసిషన్ సమయంలో రామ్ చిత్రానికి ఇంత రేటు రావడం గొప్పేనని అంటున్నారు. ఈ ‘రెడ్’ సినిమాలో రామ్ సరసన నివేద పేతురాజ్, మాళవిక శర్మ, అమృత అయ్యర్ కథానాయికలుగా నటిస్తున్నారు. రామ్ డబుల్ రోల్స్ చేస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతాన్ని సమకూరుస్తున్నారు.