మానవత్వం మనస్సును కదిలించింది…

దేశంలో లాక్ డౌన్ నేపథ్యంలో విజయవాడ నుంచి మధ్యప్రదేశ్ వెళ్తున్న వలస కార్మికులకు తెలంగాణ అటవీ శాఖ ఆడుకుంది. కరీంనగర్ సమీపంలో ఉన్న కార్మికులకు బియ్యంతో పాటు నిత్యావసర వస్తువులు అటవీశాఖ అధికారులు అందించారు.

నిర్మాణం పనులు నిలిపి వేయడంతో విజయవాడ నుంచి మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సొంత గ్రామాలకు వెళ్తున్నామని కార్మికులు ఆవేదన చెందారు. దీంతో ఈ వలస కార్మికుల సమస్యలు తెలుసుకుని వెంటనే స్పందించి నిత్యావసరాలను వరంగల్ రేంజ్ చీఫ్ కన్జర్వేటర్ MJ అక్బర్ బృందం అందించారు.