కరోనా అలెర్ట్ లో శంషాబాద్ ఎయిర్ పోర్ట్

కరోనా అలెర్ట్ లో శంషాబాద్ ఎయిర్ పోర్ట్

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో విదేశాలనుండి వచ్చిన వారిని క్వారంటాయిన్ రూమ్స్ కు తరలించడానికి RTC బస్సులను ఏర్పాటు చేసిన ప్రభుత్వం. విదేశాలనుండి వచ్చిన వారి లగేజీ ని తరలించడానికి ప్రైవేట్ లారీలు, డీసీఎం లను అందుబాటులో ఉంచిన ప్రభుత్వం.

అయితే బస్సు డ్రైవర్లకు,మహిళ కండక్టర్ లకు ఎలాంటి సదుపాయాలు కల్పించలేదు అని ఆవేదన చెందుతున్న RTC సిబ్బంది. కేవలం తినడానికి 100 రూపాయలు ఇస్తున్నారు అని అవి టీ తాగడానికి కూడా సరిపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు RTC సిబ్బంది. బస్సుల్లో ఎలాంటి సానిటైజేషన్ ఏర్పాట్లు లేవని,కనీసం మాస్కుల,హాండ్ గ్లోవ్స్ లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్న RTC సిబ్బంది. వచ్చి 24 గంటలు దాటినా ఎలాంటి సదుపాయాలు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నామని,రాత్రి దోమలకు ఇబ్బందులు పడ్డామని, కొద్దీ మంది RTC సిబ్బంది షుగర్,బీపీ ల లాంటి వాటితో మందులు లేక ఇబ్బందులు పడుతున్నారని శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో విధుల కోసం వెళ్లిన RTC సిబ్బంది ఆవేదన.*