హైదరాబాద్ పోలీసుల చాణక్యం

పాతబస్తీలో కిరోసిన్ బాంబు ఘటన కేసులను చేధించారు హైదరాబాద్ పోలీసులు. అయోధ్య రామ మందిరం తీర్పు అనంతరం సిఏఏ, ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా ఢిల్లీ అల్లర్ల తరహా హైదరాబాద్ లో అల్లర్లకు కుట్ర పన్నిన ముఠాను పట్టుకున్నారు. హైదరాబాద్ లో అల్లర్లు సృష్టించేందుకు పాతబస్తీలో రెండు దేవాలయాలను టార్గెట్ చేసుకుని కిరోసిన్ బాంబులతో దాడి చేయాలని అనుకున్నారు కానీ బాంబులు పేలకపోవడంతో ముఠా వేసిన కుట్ర విఫలమైంది. 10 రోజుల పాటు తీవ్రంగా శ్రమించి ఇద్దరు యువకులను పట్టుకున్న సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్, మాదన్నపేట్ పోలీసులు. బాంబులు వేసి మత ఘర్షణలు సృష్టించేందుకు నిందితులు 4రోజుల పాటు వివిధ ప్రాంతాల్లో రెక్కి నిర్వహించారు. ముష్కరులు అక్టీవా వాహనంపై తమ వెంట తెచ్చుకున్న కిరోసిన్ బాంబులకు లైటర్ తో నిప్పు పెట్టి దేవాలయం పై పడేసి పరారయ్యారు. ఈ ఘటనలో సీసీ కెమెరా ఫుటేజీలు కీలకంగా మారాయి. ఓ పక్క కరోనా లాక్ డౌన్ ను అమలు చేస్తూనే కిరోసిన్ బాంబు కేసును చేధించిన పోలీసులు. నిందితుల్లో ఒక్కరు రియసత్ నగర్ కి చెందిన ఆర్షద్, బాబానగర్ కు చెందిన వసీ గుర్తించి అరెస్టు చేయడం జరిగింది. నిందితులలో ఆర్షద్ కీలకంమైన వ్యక్తి. తీవ్రవాద సంస్థలలో శిక్షణ తీసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితులను పోలీసులు విచారించగా నివ్వురపోయే విషయాలు తెలిశాయి. మాదన్నపేట్ పోచమ్మ దేవాలయం పై మూడు కిరోసిన్ బాంబులు విసిరినట్లు వెల్లడించారు. చాంద్రాయణగుట్ట ATM ధ్వంసం, మిదాని బస్సుకు నిప్పు, సంతోష్ నగర్ దేవాలయం పై కిరోసిన్ దాడి, ఈ ఘటన వెనుక నిషేధిత మతతత్వ, ఉగ్రవాద సంస్థల హస్తం ఉన్నట్లు తెలుస్తుంది.