హైడ్రోజ‌న్ ఇంధ‌న‌ బ‌స్సులు, కార్లు వచ్చేసేయ్…

ఢిల్లీ, లేహ్‌లో ఒక్కొక్క‌చోట ప‌ది వంతున‌ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ (ఎఫ్‌సి) ఆధారిత ఎలక్ట్రిక్ బస్సులను, అంతే సంఖ్య‌లో హైడ్రోజన్ ఇంధన సెల్ ఆధారిత ఎలక్ట్రిక్ కార్లను అందించడానికి, భారతదేశంలో అతిపెద్ద విద్యుత్ ఉత్పత్తిదారు, విద్యుత్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని కేంద్ర ప్ర‌భుత్వ‌రంగ సంస్జ‌ అయిన ఎన్‌టిపిసి లిమిటెడ్ గ్లోబల్ ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ (ఇఒఐ) ను ఆహ్వానించింది. ఈ ఇ.ఒ.ఐ ని ఎన్‌టిపిసి యాజమాన్యంలోని దాని అనుబంధ సంస్థ అయిన ఎన్‌టిపిసి విద్యుత్ వ్యాపర్ నిగం (ఎన్‌వివిఎన్) లిమిటెడ్ జారీ చేసింది.

హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ఆధారిత వాహనాలను స‌మ‌కూర్చుకునే చర్య దేశంలో మొట్టమొదటి ప్రాజెక్టు, దీనిలో గ్రీన్ ఎనర్జీ నుండి ఫ్యూయల్ సెల్ వాహనానికి పూర్తి పరిష్కారం ల‌భించ‌నుంది.

నూత‌న‌, పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ సహకారంతో చేపట్టిన ఈ ప్రయత్నం, హైడ్రోజన్ ఉత్పత్తికి పునరుత్పాదక శక్తిని ఉపయోగించుకుంటుంది . లేహ్, ఢిల్లీలోని పైలట్ ప్రాజెక్టులలో భాగంగా దాని నిల్వ , పంపిణీ సౌకర్యాలను అభివృద్ధి చేస్తారు. హైడ్రోజన్ శక్తితో నడిచే వాహనాలను ప్రారంభించ‌డం ఉద్దేశం వాహ‌న రంగాన్ని కార్బ‌న్ ర‌హితం చేయ‌డ‌మే .

రాష్ట్ర ,నగర రవాణా సంస్థలకు ఎలక్ట్రిక్ బస్సులను అందించడం, పబ్లిక్ ఛార్జింగ్ మౌలిక సదుపాయాల కల్పన తో సహా ప్రజా రవాణాకు పూర్తి ఇ-మొబిలిటీ పరిష్కారాన్ని అందించడానికి ఈ ప్ర‌భుత్వ రంగ సంస్థ సాంకేతిక ప‌రంగా వివిధ చ‌ర్య‌లు తీసుకుంటోంది. ఇందుకు సంబంధించి వివిధ నగరాల్లో 90 పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లు, ఇ -3 వీలర్ల కోసం ఫరీదాబాద్ వద్ద బ్యాటరీ ఛార్జింగ్ , మార్పిడి స్టేషన్ ఇప్పటికే ప్రారంభించారు. అదేవిధంగా, అండమాన్ , నికోబార్ పాల‌నాయంత్రాంగం కోసం ఇ-బస్ పరిష్కారం అమలు ద‌శ‌లో ఉంది.