కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ హైడ్రాక్సీక్లోరోక్విన్ అత్యవసరమున్న దేశాలకు ఎగుమతి చేసేందుకు ఇండియా (INDIA) సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించింది. మానవత దృక్కోణంలో ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నామని పారాసిటమాల్, హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ను అవసరమైన పరిమాణంలో పొరుగు దేశాలకు సరఫరా చేస్తామని తెలిపింది.
ఈ మెడిసిన్స్‌ను అత్యవసరమున్న దేశాలకు కూడా ఎగుమతి చేస్తామని ప్రకటించింది.
USA అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ రెండు రోజుల క్రితం హైడ్రాక్సీక్లోరోక్విన్ భారత్ సరఫరా చేయాలని, అలాగే బ్రెజిల్, స్పెయిన్‌తో సహా కరోనా ప్రభావవంతంగా ఉన్న దేశాలు
ఈ మెడిసిన్స్‌ను సరఫరా చేయాలని కోరాయి. ఈ అత్యవసర డ్రగ్ సరఫరాను రాజకీయం చేయరాదని కేంద్ర విదేశాంగ శాఖ విజ్ఞప్తి చేసింది.