హైడ్రాక్సీక్లోరోక్విన్‌ దివ్య ఔషధమా??

క‌రోనా వైర‌స్ విజృంభ‌న నేప‌థ్యంలో హైడ్రాక్సీక్లోరోక్విన్‌ ఔష‌దం ఇప్పుడు ప్ర‌పంచ దేశాల‌కు సంజీవ‌నిగా మారింది. ప్ర‌పంచాన్ని అత‌లాకుత‌లం చేస్తున్న క‌రోనా వైర‌స్ మహామ్మారికి అడ్డుకట్ట వేయ‌డానికి మందు లేదు. వ్యాక్సిన్ ఇంకా ప‌రిశోధ‌న ద‌శ‌లో ఉంది. అయితే నివార‌ణ‌కు ప్ర‌స్తుతం అందుబాటులో ఉన్న హైడ్రాక్సీక్లోరోక్విన్‌ మందుతో పాటు అజిత్రోమైసిన్ ఔష‌దాన్ని వినియోగిస్తూ వైర‌స్ నుంచి బాధితుల‌ను ప్రాణాపాయం నుంచి త‌ప్పించే ప‌ని యుద్ద‌ప్రాతిప‌దిక‌న సాగుతోంది. క‌రోనా వైర‌స్‌కు విరుగుడుగా ప్ర‌చారంలో ఉన్న సంజీవని హైడ్రాక్సీక్లోరోక్వీన్ కోసం ప్ర‌పంచ దేశాలు భార‌త్ వైపు ధీనంగా ఆర్థిస్తున్నాయి.

ప్ర‌పంచ దేశాల‌కు సంజీవ‌నిగా మారిన హైడ్రాక్సీక్లోరోక్వీన్ ఉత్ప‌త్తి మ‌న‌దేశంలోనే జ‌రుగుతోంది. మ‌లేరియా వ్యాధికి నివార‌ణ‌కు ఈ ఔష‌దాన్ని క‌నుగొని త‌యారు చేశారు. హైడ్రాక్సీక్లోరోక్వీన్ వెనుక భార‌త ర‌సాయ‌న శాస్త్ర జాతిపిత ఆచార్య ప్ర‌ఫుల్ చంద్ర‌రాయ్ కృషి ఉంది. ఆచార్య ప్ర‌ఫుల్ చంద్ర‌రాయ్ ప్ర‌సిద్ధి గాంచిన శాస్త్ర‌వేత్త‌, ప్రొఫెస‌రే కాదు దేశ తొలి ర‌సాయ‌న ప‌రిశోధ‌కుడుగా దేశానికి వ‌న్నె తెచ్చారు. 1896లో స్టేబుల్ కంపౌండ్ మెర్కుర‌స్ నైట్రేట్‌ను కనుగొన్నారు. 1901లో దేశంలోనే తొలి ఫార్మాసిట్యూక‌ల్ సంస్థ‌ బెంగాల్ కెమిక‌ల్స్‌ను స్థాపించారు. కోవిడ్‌-19కి మందుగా ఉప‌యోగిస్తున్న హైడ్రాక్సీ క్లోరోక్వీన్‌ను అత్య‌ధికంగా ఉత్ప‌త్తి చేస్తున్న లీడింగ్‌ కంపెనీగా చ‌రిత్ర పుటల్లో రాయబడింది.

క‌రోనా వైర‌స్ వ్యాధి నుంచి ర‌క్షించుకోడానికి లేదా న‌యం చేయ‌డానికి ఏ మందు కూడా ప‌నిచేస్తుంద‌న‌డానికి ఆధారాలేమీ లేవు. ఇలాంటి ప‌రిస్థితుల నేప‌థ్యంలో భార‌త్ ఉత్ప‌త్తి చేస్తున్న సంజీవ‌ని హెడ్రాక్సీక్లోరోక్వీన్ ఔష‌దం ప్ర‌పంచ దేశాల దృష్టిని ఆక‌ర్షించింది. మ‌లేరియా కోసం త‌యారు చేసిన హైడ్రాక్సీక్లోరోక్వీన్ ఔష‌దాన్ని రుమ‌టైడ్ ఆర్థ‌రైటీస్‌, లూప‌స్ వంటి వ్యాధుల చికిత్స‌కు అనేక ద‌శాబ్దాల నుంచి వాడుతున్నారు. అయితే హైడ్రాక్సీక్లోరోక్వీన్ ఔష‌దాన్ని క‌రోనా వైర‌స్ చికిత్స కోసం వినియోగిస్తుండ‌డాన్ని USA ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేష‌న్ (ఎఫ్‌డిఏ) ఆమోదం తెలిపిన‌ట్టు అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ప్ర‌క‌టించారు. కానీ ట్రంప్ ప్ర‌క‌ట‌న‌ను ఎఫ్‌డిఏ ఖండించింది. దీంతో క‌రోనా వైర‌స్ సంక్ర‌మించిన రోగుల్లో కారుణ్య ప‌రిస్థితుల్లో వినియోగించ‌డానికి ఎఫ్‌డిఏ ఆమోదం ఉంద‌ని అధ్య‌క్షుడు ట్రంప్ వివ‌ర‌ణ ఇచ్చారు. ప్రాణాపాయం ఉన్న ప‌రిస్థితుల్లో హైడ్రాక్సీక్లోరోక్వీన్‌ను రోగుల‌కు సూచించ‌వ‌చ్చ‌ని ట్రంప్ అభిప్రాయబడ్డారు. ఆ నేప‌థ్యంలో ట్రంప్ స‌హా ప్ర‌పంచంలోని 30 దేశాల‌కు పైగా హైడ్రాక్సీక్లోరోక్వీన్‌ మందును స‌ర‌ఫ‌రా చేయాల‌ని కోరుతూ భార‌త్‌కు లేఖ‌లు రాసాయి.

డాక్టర్ బి. మురళీధర్ యడియాల్, ప్రొఫెసర్, డిపార్ట్ మెంట్ ఆఫ్ మెడిసిన్, కస్తూర్బా మెడికల్ కాలేజీ, మంగళూరు, కర్ణాటక. హైడ్రాక్సీక్లోరోక్వీన్ ఏమంటున్నారో తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.

ఇలాంటి ప‌రిస్థితుల నేప‌థ్యంలో అస‌లు హైడ్రాక్సీక్లోరోక్వీన్ ఔష‌దం నేప‌థ్యం, దాని ప్ర‌యోజ‌నాలు, న‌ష్టాల‌పై ఉన్న సందేహాలు, అనుమానాల‌కు స‌మాధానాలు తెలుసుకుందాం.

హైడ్రాక్సీక్లోరోక్వీన్ అంటే ఏమిటి..???
మలేరియా వ్యాధికి చికిత్స అందించ‌డానికి ద‌శాబ్దాల కిందటి నుంచి త‌యారు చేస్తూ వస్తున్న ఔష‌ద‌మే హైడ్రాక్సీక్లోరోక్వీన్‌. రుమ‌టాయిడ్ ఆర్థ‌రైటీస్‌, లుపుస్ వంటి వ్యాధుల బారిన ప‌డిన వారికి చికిత్స‌గా ఈ ఔష‌దాన్ని వినియోగిస్తారు. కొన్ని సంద‌ర్భాల్లో ప్లాక్వెనిల్ బ్రాండ్ పేరుతో వైద్యులు రెఫ‌ర్ చేస్తుంటారు. అంతేకాదు, మ‌లేరియాకు చికిత్స అందిస్తున్న క్లోరోక్వీన్‌కు అతి ద‌గ్గ‌ర‌గా ఈ ఔష‌దం ఉంటుంది.

హైడ్రాక్సీక్లోరోక్వీన్ ఔష‌దాన్ని క‌రోనా వైర‌స్‌ చికిత్స‌కు మందుగా ఎందుకు ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటున్నారు??

హైడ్రాక్సీక్లోరోక్వీన్ వాడకంపై చాలా కార‌ణాలు ఉన్నాయి. క‌రోనా వైర‌స్ విస్త‌ర‌ణ (క‌రోనా వైర‌స్‌ల సంఖ్య పెర‌గ‌కుండా) కాకుండా క్లోరోక్వీన్ అడ్డుకుంటుంద‌ని ఓ లాబోరేట‌రీ అధ్య‌యంన ద్వారా తేలింది. హైడ్రాక్సీక్లోరోక్వీన్‌, కొన్ని సంద‌ర్భాల్లో యాంటిబైటిక్ అజిత్రోమైసిన్ రోగుల‌కు స‌హాయ‌ప‌డుతుంద‌ని చైనా, ఫ్రాన్సు వైద్యులు నివేదించారు.

అయితే రోగుల శ‌రీత‌త్వం ఆధారంగా ఈ రెండు ఔష‌దాల్లో ఒక్కో ఔష‌దం ప‌నిచేస్తుంద‌ని అధ్య‌య‌నాలు తెలుపుతున్నాయి. క‌రోనా వైర‌స్ రోగుల కోసం హైడ్రాక్సీ క్లోరోక్వీన్‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకోడానికి మ‌రోకార‌ణం ఏమిటంటే.. ఇది చురుకైన రోగ‌నిరోధ‌క వ్య‌వస్థ ఏర్పాటుకు దోహ‌ద‌ప‌డుతుంది. అందుకే రుమాటిక్ ఆర్థ‌రైటీస్‌తో పాటు లుపుస్‌, మ‌రి కొన్ని సంద‌ర్భాల్లో కోవిడ్‌-19కు ఈ ఔష‌దాన్ని వినియోగిస్తుంటారు.

క‌రోనా వైర‌స్ సంక్ర‌మించ‌కుడా హైడ్రాక్సీక్లోరోక్వీన్ ర‌క్ష‌ణ క‌వ‌చంలా ప‌నిచేస్తుందా??

క‌రోనా వైర‌స్‌ ఇన్ఫెక్ష‌న్ నుంచి హైడ్రాక్సీక్లోరోక్వీన్ కాపాడుతుంద‌న‌డానికి ఎలాంటి ఆధారాలు లేవు. అయితే మిన్నేసొటా యూనివ‌ర్శిటీ ప‌రిశోధ‌కులు.. క‌రోనా సంక్రిమిత రోగుల‌కు హైడ్రాక్సీక్లోరోక్వీన్ ఔష‌దాన్ని ఇచ్చి ప్ర‌యోగాత్మ‌కంగా ప‌రీక్ష‌లు జ‌రుపుతున్నారు. వైర‌స్ నుంచి హైడ్రాక్సీ క్లోరోక్వీన్ రోగుల‌ను కాపాడుతుందా.. లేదా అనేది ప‌రీక్ష‌ల ఫ‌లితాల‌పై ఆధార‌ప‌డి ఉంటుంది.

హైడ్రాక్సీక్లోరోక్వీన్ ఔష‌దానికి USA ఫుడ్ అండ్ డ్ర‌గ్ అడ్మినిస్ట్రేష‌న్ ఆమోదం ఉందా??

హైడ్రాక్సీక్లోరోక్వీన్ ఔష‌దానికి USA ఫుడ్ అండ్ డ్ర‌గ్ అడ్మినిస్ట్రేష‌న్ ఆమోదం ఉంది. కాని క‌రోనా వైర‌స్ వ్యాధికి చికిత్స‌గా వినియోగానికి ఆమోదం ఇవ్వ‌లేదు. హైడ్రాక్సీ క్లోరోక్వీన్ ఔష‌దాన్ని కేవ‌లం మ‌లేరియా, లుపుస్ మ‌రియు రుమ‌టాయిడ్ ఆర్థ‌రైటీస్ వ్యాధుల‌కు వినియోగించేలా ఆమోదం తెలిపింది. అంతే కానీ కోవిడ్‌-19కు వినియోగించేలా ఆమోదం ఇవ్వ‌లేదు. అయితే ద‌శాబ్దాల నుంచి వైద్యులు ఈ ఔష‌దాన్ని రోగుల‌కు సూచిస్తున్నారు. ఏది ఏమైనా ఎఫ్‌డిఏ ఆమోదం లేక‌పోయిన‌ప్ప‌టికీ ప్ర‌స్తుతం హైడ్రాక్సీ క్లోరోక్వీన్ డిమాండ్ భారీగా ఉంది.

హైడ్రాక్సీక్లోరోక్వీన్ ఔష‌దాన్ని ఇప్పుడు క‌రోనా వైర‌స్ రోగుల‌కు ఇస్తున్నారా??

హైడ్రాక్సీక్లోరోక్వీన్ మందు పలు ఆసుప‌త్రుల్లో క‌రోనా వైర‌స్ రోగుల‌కు ఈ ఔష‌దాన్ని ఇస్తున్నారు. అయితే క‌రోనా వైర‌స్ మహామ్మారికు హైడ్రాక్సీక్లోరోక్వీన్ స‌రైనా ఔష‌దం అని నిరూప‌ణ కాక‌పోయిన‌ప్ప‌టికీ కొంత మేర‌కు స‌హాప‌డుతుంద‌నే న‌మ్మ‌కం ఉంది. హైడ్రాక్సీక్లోరోక్వీన్‌పై ప్ర‌పంచ వ్యాప్తంగా క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్ ప్రారంభం అయ్యాయి. ఈ నెల 2న అమెరికాలోని 44 కేంద్రాల్లో క‌రోనా సంక్ర‌మిత రోగుల‌కు హైడ్రాక్సీక్లోరోక్వీన్ ఔష‌దాన్ని ఇచ్చి క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్ ప్రారంభించారు. క‌రోనా వైర‌స్‌కు విరుగుడుగా హైడ్రాక్సీక్లోరోక్వీన్ ప‌నిచేస్తుందా లేదా అనేది అధ్య‌య‌నం అవ‌స‌రం అని ప‌రిశోద‌కులు తెలిపారు. ఒకవేళ ఈ ఔష‌దం ప‌నిచేయ‌కుంటే, స‌మ‌యంతో పాటు వ్య‌యాన్ని ఇత‌ర వైద్యానికి మ‌ళ్ళిస్తామ‌ని ప‌రిశోధ‌కులు చెబుతున్నారు.

హైడ్రాక్సీక్లోరోక్వీన్ తీసుకోవ‌డం వ‌ల్ల ఏదైనా ప్ర‌మాదం ఉంటుందా?

ఏ ఔష‌ద‌మైనా స‌రే సైడ్ ఎఫెక్ట్‌లు ఉంటాయి. హృద‌య సంబంధిత రోగులు, కంటి రోగులు, కాలేయం, క‌డ్నీ స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న వారికి ఇలాంటి ఔష‌దాలు స‌రికాదు. హార్ట్ రైత్మ్ తో ఉన్న వారికి హైడ్రాక్సీ క్లోరోక్వీన్‌తో పాటు అజిత్రోమైసిన్ చాలా ప్ర‌మాద‌కారి అని కార్డియాల‌జీ నిపుణులు ఈ నెల 8న ఓ జ‌ర్న‌ల్‌లో హెచ్చ‌రిక‌లు జారీ చేశారు. క‌రోనా వైర‌స్ ద్వారా శ‌రీరంలోని ఆర్గాన్ కు న‌ష్టం వాటిల్లిన రోగుల‌కు హైడ్రాక్సీక్లోరోక్వీన్ సుర‌క్షిత‌మైన‌దా అనే విష‌యంలో తెలియ‌దు. రక్తంలో హిమోగ్లోబిన్ (HB)లో కరోనా వైరస్ లెవెల్స్ పెరగకుండా అదుపులో ఉంచుతుంది.

హైడ్రాక్సీక్లోరోక్వీన్ ఔష‌దాన్ని పొంద‌గ‌లిగి ఉంటే, వైర‌స్ ఇన్ఫెక్ష‌న్ నివార‌ణ‌కు ఈ ఔష‌ధాన్ని వినియోగించ‌వ‌చ్చా?

వైద్యుడిని సంప్ర‌దించ‌కుండా ఎలాంటి ఔష‌దాల‌ను తీసుకోవ‌ద్దు. మీ మెడిక‌ల్ హిస్ట‌రీతో పాటు ప్ర‌స్తుతం మీరు వాడుతున్న మందుల వివ‌రాల గురించి డాక్ట‌ర్‌కు తెలియ‌చేయాలి. క‌రోనా వైర‌స్‌కు హైడ్రాక్సీక్లోరోక్వీన్ ప‌నిచేస్తుంద‌న‌డానికి ఎలాంటి ఆధారాల్లేవు. ఒక వేళ హైడ్రాక్సీ క్లోరోక్వీన్ మీ వీధి మార్కెట్‌లో లేదా ఆన్ లైన్‌లో విక్ర‌యాలు జ‌రుగుతున్నాయంటే అది మోస‌పూరిత‌మే అలాగే నేరం కూడా మ‌రియు సుర‌క్షితం కాదు.

దేశంలో ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో క‌రోనా వైర‌స్ సంక్ర‌మించ‌కుండా సామాజిక‌, భౌతిక దూరం పాటించ‌డం, క్వారంటైన్‌లో ఉండ‌డ‌మే స‌రైన మందు. క్లాత్ మాస్క్‌లు ధ‌రించ‌డంతో పాటు త‌రుచూ చేతుల‌ను శుభ్రం చేసుకుంటూ ఉండాల‌ని సెంట‌ర్స్ ఫ‌ర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్ష‌న్ సూచిస్తోంది.

దేశంలో ప్రముఖ సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్. పి. చంద్రశేఖర్ కరోనాపై కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటిస్తోన్న జాగ్రత్తలు, నియమ నిబంధనలు ఖచ్చితంగా తీసుకోవాలన్నారు. ప్రతి ఒక్కరు సురక్షితంగా ఇంటికే పరిమితం అవ్వాలని సామాజిక దూరం అమలు తప్పకుండా పాటించాలని విజ్ఞప్తి చేసారు. ఈ అత్యవసర కష్టకాలల్లో ప్రజలు ఎలాంటి అశ్రద్ధ, నిర్లక్ష్యం వహించకుండా ఎలాంటి అనుమానాలు కలిగిన వైద్యులను సంప్రదించాలని సూచించారు.

డాక్టర్ పి. చంద్రశేఖర్, MD, DM, FACC.
* కోవిడ్-19 ప్రత్యేక అధికారి, ఆంధ్రప్రదేశ్.
* ఆడిషినల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్-AP
* ప్రిన్సిపాల్, కర్నూల్ మెడికల్ కాలేజీ. AP.
* ప్రొఫెసర్ అండ్ HoD, కార్డియాలజీ విభాగం, కర్నూల్
జనరల్ హాస్పిటల్. AP