అపాచి హెలికాప్టర్ ఎమర్జెన్సీ లాండింగ్

IAF అపాచి హెలికాఫ్టర్ 17 ఏప్రిల్ 2020న పఠాన్ కోట్ ఏయిర్ బేస్ నుండి బయలుదేరిన ఓ గంటలో సాంకేతిక సమస్యలు తలెత్తి పంజాబ్ రాష్ట్రంలోని పశ్చిమ ఇండోరా ప్రాంతంలో సురక్షితంగా లాండ్ అయ్యింది.

ఆ సమయంలో హెలికాప్టర్ పైలట్ సమస్యను వెంటనే గుర్తించి సురక్షింతంగా క్రిందకి దించడం వలన అందులోని సిబ్బంది అంతా సురక్షింతంగా బయటపడటంతో పాటు హెలికాప్టర్ కు కూడా ఎటువంటి నష్టం జరుగలేదు. సాంకేతిక సమస్యను పరిష్కరించిన తరువాత హెలికాప్టర్ మరల బయలుదేరుతుంది.