త్వరలో అందరికి స్వచ్ఛమైన తాగునీరు..

అసోంలోని ‘పురోగమన శాస్త్ర-సాంకేతిక అధ్యయన సంస్థ’ (IASST)లో బిశ్వజిత్‌ చౌదరి సహాయ ఆచార్యులుగా పనిచేస్తున్నారు. సూర్యకాంతి సంవర్ధనంద్వారా నీటినుంచి విష సేంద్రియ సమ్మేళనాల తొలగింపు దిశగా వినూత్న పరిశోధన చేస్తున్నారు.

ఈ మేరకు ‘ప్లాస్మోనిక్‌ సెమికండక్టర్‌ నానో మెటీరియల్స్‌’ (కాంతి ఢీకొన్నపుడు నీటి ఉపరితలంపై సామూహికంగా అటూఇటూ చలించే ఎలక్ట్రాన్లతో కూడిన లోహంవంటి సూక్ష్మ పదార్థాల) రూపకల్పనకు శ్రమిస్తున్నారు. నీటిలోని కాలుష్యాలను రూపుమాపి, పునరుత్పాదక ఉదజనిని సృష్టించే విధంగా ఈ సూక్ష్మ పదార్థాల ఛాయా ఉత్ప్రేరక సామర్థ్యాన్ని సౌరకాంతి సహాయంతో పెంచేందుకు ఆయన కృషి చేస్తున్నారు.

కేంద్ర శాస్త్ర-సాంకేతిక మంత్రిత్వ శాఖ ప్రవేశపెట్టిన ‘ఇన్‌స్పైర్‌’ బోధక పథకం కింద మంజూరైన నిధుల సాయంతో బిశ్వజిత్‌ చౌదరి తన పరిశోధనను విజయవంతం చేసేందుకు అన్నివిధాలుగానూ శ్రమిస్తున్నారు. ఇందులో భాగంగా సమీపంలోని వివిధ ప్రాంతాల నుంచి కలుషిత నీటిని సేకరించి, అందులోని విష పదార్థాలను తొలగించి, తాగడానికి వీలుగా రూపొందించేందుకు యత్నిస్తున్నారు.