టీ20 ర్యాంకింగ్స్ విడుద‌ల చేసిన ఐసీస

టీ20 ర్యాంకింగ్స్ విడుద‌ల చేసిన ఐసీసీ

ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) టీ20 ర్యాంకింగ్స్‌ను విడుద‌ల చేసింది. ఇందులో ఇంగ్లండ్‌ అగ్రస్థానంలో నిలిచింది. ఆ త‌ర్వాతి స్థానాల్లో వ‌రుస‌గా ఆస్ట్రేలియా, భార‌త్ ఉన్నాయి. టీ20 బ్యాట్స్‌మెన్‌ ర్యాంకింగ్స్‌లో భార‌త బ్యాట్స్‌మ‌న్‌ కేఎల్‌ రాహుల్‌ ఒక స్థానం ఎగ‌బాకి, రెండో స్థానానికి చేరుకున్నాడు. ఆయ‌న‌‌ ఖాతాలో 816 రేటింగ్‌ పాయింట్లు ఉన్నాయి.ఈ జాబితాలో ఇంగ్లండ్‌ క్రికెటర్‌ డేవిడ్‌ మలాన్ ( 915 రేటింగ్‌ పాయింట్లు) అగ్ర‌స్థానంలో కొనసాగుతుండ‌గా, విరాట్ కోహ్లీ ఏడో ర్యాంక్‌లో ఉన్నాడు. ఇక బౌలర్ల ర్యాంకింగ్స్‌లో ఆఫ్ఘన్ ఆట‌గాడు రషీద్‌ ఖాన్ (736 పాయింట్లు) అగ్ర‌స్థానంలో ఉండ‌గా, సౌతాఫ్రికా ఆట‌గాడు షమ్సీ (733 రేటింగ్‌ పాయింట్లు) రెండో ర్యాంక్‌కు చేరుకున్నాడు.