కరోనాలో రూపాయికే ఇడ్లీ

కరోనా లాక్‌డౌన్‌ సందర్భంగా తన గ్రామస్థులకు ఏదైనా సేవ చేయాలనే తపనతో అతి తక్కువ ధరకు అల్ఫాహారం అందించేలా ఓ సర్పంచ్ ముందుకొచ్చారు. ఒక్కో ఇడ్లీ కేవలం ఒక్క రూపాయికే అందిస్తూ తన ఔదార్యం చాటుకున్నాడు. తమిళనాడు రాష్ట్రం తిరుచ్చి జిల్లా వెంకటాచలపురంలో రూపాయికే ఒక ఇడ్లీ అమ్ముతూ పేదల ఆకలి తీర్చుతున్నాడు.ప్రధానంగా వృద్ధులు, రైతుల కోసం ఈ సేవా కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు సర్పంచ్ పళనిస్వామి పేర్కోన్నారు. సుమారు రెండు వేల గడపలున్నా ఇప్పటికీ అక్కడ హోటల్‌ కూడా లేకపోవడం గమనార్హం. కరోనా కష్ట కాలంలో ఎవరు ఆకలితో అలమతించకుండా ఉండేందుకు దేశమంతటా దాతలు తమ వంతు సహాయం కొనసాగిస్తుండటం సంతోషకరమైన
శుభపరిణామం.