కరోనా వైరస్ సోకిన వ్యక్తులకు వైద్య సేవల కోసం తక్కువ ఖర్చుతో ‘బ్యాగ్ వాల్వ్ మాస్క్’ను ఐఐటీ హైదరాబాద్ తయారు చేసింది. అత్యవసర సమయాల్లో వెంటిలేటర్ వాడేందుకు ఐఐటీ అనుబంధ సెంటర్ ఫర్ హెల్త్‌కేర్ ఎంట్రప్రెన్యూర్షిప్ సంబంధించిన ఏరోబయోసిస్ ఇన్నోవేషన్స్ స్టార్టప్ కంపెనీ ఈ వెంటిలేటర్‌ను మన ముందుకు తీసుకు వచ్చింది. ఈ ఎమర్జెన్సీ వెంటిలేటర్లో అనేక అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయని ఏరోబయోసిస్ అందుకే జీవన్‌లైట్ పిలవాలని నామకరణం చేసింది. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ సహకారంతో విద్యుత్ సౌకర్యం లేకపోయినప్పటికి బ్యాటరీ బ్యాటరీ ఉపయోగించుకుని వాడేందుకు అనుకూలంగా ఉంటుంది.
మనదేశంలో జీవన్‌లైట్ ఎమర్జెన్సీ వెంటిలేటర్ వెద్యులు, రోగుల కుటుంబ సభ్యులకు తక్షణ రక్షణ అందించనుంది. అంతేకాకుండా కేవలం ఓ లక్ష రూపాయలకే మార్కెట్టులోకి తీసుకు వస్తున్నామని ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ మూర్తి తెలిపారు. ఎమెర్జెన్సీ అవసరల్లో ప్రస్తుతం ఏరోబయోసిస్‌కు రోజుకు 50 నుంచి 70 యూనిట్లు తయారు చేయగలదు.
వ్యాధిగ్రస్తుల శ్వాస రికార్డు చేయడం, వైద్యులకు ఆండ్రాయిడ్ యాప్ అనుసంధానంతో సమాచారం అందజేసే ఫీచర్‌తో పాటు, ఆక్సిజన్ సిలిండర్‌ను జత చేసే విధంగా ఈ జీవన్‌లైట్‌ను రూపకల్పన చేశారు. శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉన్నప్పుడు అద్భుతంగా అత్యవసర సమయాల్లో జీవన్ లైట్ రక్షణ కవచంలా కావుడుతుందని, బ్యాటరీని ఓ సారి చార్జ్ చేస్తే
అయిదు గంటలు పని చేస్తుందని, వైర్లెస్ కనెక్టివిటీ ఫీచర్ కారణంగా రిమోట్ మానిటరింగ్ విధానంలో వైరస్ సోకిన వ్యక్తులను తాకకుండానే ఉపయోగం చేయవచ్చని IIT హైదరాబాద్ బృందం తెలిపింది.