వజ్రాల నగరంలో వలస కూలీలు కరోనాను లెక్క చేయకుండా పోరాడుతున్నారు

వలస కూలీలు బతుకు పోరాటం చేస్తున్నారు. అక్కడ ఇక్కడ ఎక్కడైనా ఒక్కటే సమస్య వలస కూలీలకు కూడు, గూడు కావాలనే డిమాండ్. లేదంటే స్వస్థలాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.

గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ జిల్లాలో ఒక నెలలోనే మూడవ సారి వలస కూలీలు తమ హక్కులపై అనుమతించాలని డిమాండ్ చేశారు. ఈ రోజు ఉదయం డైమండ్ బోర్స్ వద్ద వలస వచ్చిన కూలీలు నిర్మాణ ప్రదేశంలో గాజు కిటికీలు మరియు తలుపులను బద్దలు కొట్టారు. మమ్మల్ని, మా కుటుంబాలను కాపాడే దిక్కే లేదా మేమేలా బతకాలని వందలాది మంది కూలీలు ఒక్కటై గోడు వెళ్లబోసుకున్నారు.

ఐతే పోలీసులు కరోనా మహామ్మారి ఉండటంతో జనం గుంపులు గుంపులుగా ఉండరాదు, మంచిది కాదని సామాజిక దూరం పాటించాలి, మోహానికి మాస్కులు వేసుకోవాలని కూలీలతో వారించారు. కానీ అప్పటికి శాంతించని కూలీలు మా డిమాండ్ వెంటనే నెరవేర్చాలని గళం బలంగా వినిపించారు. కాకపోతే ఈ వలస కూలీలు గుంపులుగా ఇండటం ఇక్కడ చాలా బాధాకరమైన విషయం.