వానకాలం, యాసంగి అనాల్సిందే…

TS సర్కారు తెలంగాణ ప్రజలకు స్థానిక భాషలో అర్ధమయ్యే వానాకాలం, యాసంగిగా ఋతువులను పిలవాలని మార్పులు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యమంత్రి KCR ఆదేశాలతో మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆమోదం మేరకు వ్యవసాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అన్నపూర్ణ తెలంగాణలో వ్యవసాయ కాలాల పేర్లలో నిర్ణయం తీసుకున్నారు. రాబోయే రోజుల్లో శాఖాపరమైన ఉత్తర్వులు, పత్రాల్లో వానాకాలం, యాసంగి అని రాయబోతున్నారు.

ఖరీఫ్, రబీ పదాలు రద్దు చేస్తూ బ్సామాన్యులకు అర్ధమయ్యే రీతిలో వ్యవసాయ సీజన్ల పేర్లను ఖరారు చేసారు. ఇక నుండి శాఖాపరమైన ఉత్తర్వులు, పత్రాలలో వానాకాలం, యాసంగి పదాలనే వాడాలి. ఇప్పటివరకు సామాన్యులకే కాదు, చదువుకున్న వారికీ ఖరీఫ్, రబీ పదాలను వాడే విషయంలో గందరగోళం ఉంది. వ్యవసాయ, ఉద్యాన విశ్వవిద్యాలయాలు, కార్పోరేషన్లు, వ్యవసాయ శాఖ కార్యాలయాలకు సూచన చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.