లెఫ్టినెంట్ గవర్నర్ అధికారాల పెంపు

లెఫ్టినెంట్ గవర్నర్ అధికారాల పెంపు

ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అధికారాలకు సంబంధించి కేంద్రం తీసుకువచ్చిన కీలక బిల్లు రాష్ట్రపతి ఆమోదంతో చట్టరూపం దాల్చగా, ఇప్పుడది అమల్లోకి వచ్చింది. దీని ప్రకారం ఇకపై ఢిల్లీలో అత్యున్నత నిర్ణాయక అధికారం లెఫ్టినెంట్ గవర్నర్ సొంతం అవుతుంది. అంటే, ఇకపై సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఏ నిర్ణయం తీసుకున్నా, దానికి లెఫ్టినెంట్ గవర్నర్ ఆమోదం ఉంటేనే కార్యరూపం దాల్చుతుంది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. నిన్నటి నుంచి ఈ చట్టం అమల్లోకి వచ్చినట్టు పేర్కొంది.ఈ చట్టానికి ది గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ (అమెండ్ మెంట్) యాక్ట్-2021గా నామకరణం చేశారు. లెఫ్టినెంట్ గవర్నర్ కు మరిన్ని అధికారాలు అందించడమే ఈ సవరణ చట్టం ముఖ్య ఉద్దేశం. ఈ బిల్లుకు గతేడాది మార్చిలో పార్లమెంటు ఆమోదం లభించగా, రాష్ట్రపతి కూడా లాంఛనంగా ఆమోదం తెలిపారు. ఢిల్లీలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు ఎగ్జిక్యూటివ్ నిర్ణయాలు తీసుకోవాలంటే అందుకు గవర్నర్ అనుమతి తప్పనిసరి అని ఈ చట్టం చెబుతోంది.