మనోవాంఛఫల సిద్ధిరస్తూ…మంచిదే

భార‌త్‌లో క‌రోనా వైర‌స్ వ్యాప్తి 10% కూడా మించదని, భారతీయులు ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని మ‌న‌దేశంలో నివసించే చైనా విద్యార్ధుల‌కు డ్రాగన్ ప్ర‌ముఖ వైద్య‌నిపుణుడు ఝూంగ్ వెన్ హాంగ్ ధైర్యమిచ్చాడు.

భార‌తీయుల మాన‌సిక శ‌క్తియే వారిని క‌రోనా వైర‌స్ నుంచి ర‌క్షిస్తుంద‌ని తెలియ‌జేశారు. భార‌త్‌లోని చైనా విద్యార్ధుల‌తో వీడియో కాన్ఫ‌రెన్సు ద్వారా ప‌ల‌క‌రించిన‌ చైనాలోని ప్ర‌ముఖ వైద్య‌నిపుణుడు ఝూంగ్ వెన్‌హాంగ్ .. భార‌త్ గురించి చాలా ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను పంచుకున్నాడు.

ప్ర‌పంచాన్ని అతలాకుత‌లం చేస్తున్న క‌రోనా వైర‌స్ మ‌హామ్మారి విష‌యంలో ఆందోళ‌న చెంద‌కుండా ధైర్యం నూరిపోశారు. భార‌త్ లో మాస్క్‌లు లేకుండా ఆధ్య‌త్మిక ప్ర‌దేశాల‌ను సంద‌ర్శిస్తుండ‌డం వారిలో మాన‌సిక స్థైర్యానికి నిద‌ర్శ‌న‌మ‌ని చెప్పారు.

అమెరికాతో పోలిస్తే భార‌తదేశంలో క‌రోనా కేసులు చాలా త‌క్కువ‌గా ఉన్నాయ‌ని, ప్ర‌శాంత‌ మ‌న‌స్త‌త్వం క‌లిగిన భార‌తీయులు క‌రోనా వైర‌స్‌ను ధీటుగా ఎదుర్కోగ‌ల‌ర‌నే అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశాడు ఝూంగ్. కాగా, ఏప్రిల్ 25 ఉదయం 8 గంటలకు కేంద్ర ఆరోగ్య శాఖ స‌మాచారం ప్రకారం దేశంలో 24,506 క‌రోనా కేసులు న‌మోదు కాగా, 18,668 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. 5,063 మందికి వ్యాధి తగ్గగా డిశ్చార్జి అయ్యారు, మొత్తం 775 మంది క‌రోనాతో మృతి చెందారు.