తొలి ఇన్నింగ్స్ లో భార‌త్ 336 ప‌రుగుల‌కు ఆలౌట్

తొలి ఇన్నింగ్స్ లో భార‌త్ 336 ప‌రుగుల‌కు ఆలౌట్

భార‌త్-ఆస్ట్రేలియా నాలుగో టెస్టు మ్యాచు తొలి ఇన్నింగ్స్ లో భార‌త్ 336 ప‌రుగుల‌కు ఆలౌట్ అయింది. తొలి ఇన్నింగ్సు లో ఆస్ట్రేలియా 369 ప‌రుగులు చేసిన విష‌యం తెలిసిందే. దీంతో తొలి ఇన్నింగ్సులో ఆస్ట్రేలియా 33 ప‌రుగుల ఆధిక్యాన్ని క‌న‌బ‌ర్చింది.తొలి ఇన్నింగ్సులో టీమిండియాలో రోహిత్ శర్మ 44, శుభమన్ గిల్ 7, ఛటేశ్వర్ పుజారా 25, అజింక్యా రహానే 37, మయాంక్ అగర్వాల్ 38, పంత్ 23, వాషింగ్ట‌న్ సుంద‌ర్ 62, శార్దూల్ ఠాకూర్ 67, సైనీ 5, సిరాజ్ 13, న‌ట‌రాజ‌న్ 1 (నాటౌట్) ప‌రుగులు చేశారు. ఎక్స్ ట్రాల రూపంలో 14 ప‌రుగులు వ‌చ్చాయి. ఆసీస్ బౌలర్లలో జోష్ కు ఐదు, స్టార్క్, కమిన్స్, స్టార్ కు రెండేసి, లైయ‌న్ కు ఓ వికెట్ ద‌క్కాయి.