భారత్-చైనా కార్గో రాకపోకలు?

అంత‌ర్జాతీయ‌గా పౌర‌విమానయాన మంత్రిత్వ‌శాఖ‌, ఎయిర్ ఇండియాలు కీల‌క మందుల స‌ర‌ఫ‌రాకు సంబంధించి ఇండియా- చైనాల మ‌ధ్య కార్గో ఎయిర్ బ్రిడ్జి ఏర్పాటుకు చైనాతో స‌న్నిహితంగా క‌ల‌సి ప‌నిచేశాయి. ఇండియా, చైనాల మ‌ధ్య తొలి కార్గో విమానాన్ని 2020 ఏప్రిల్ 4న న‌డిపారు. ఇది 21 ట‌న్నుల కీల‌క మందుల‌ను చైనాకు స‌ర‌ఫ‌రా చేసింది. కేంద్ర
పౌర విమానయాన మంత్రిత్వ శాఖ అధికారికంగా ఈ వివరాలు వెల్లడించింది. అలాగే మన దేశ‌ వ్యాప్తంగా లాక్ డౌన్ కారణంగా 161 ట‌న్నుల స‌ర‌కు ర‌వాణా లైఫ్ లైన్ ఉడాన్ విమానాల సహాయంతో గమ్య స్థానాలకు చేరవేసారు.