కోవిడ్‌-19 ఎమర్జెన్సీ ప్యాకేజ్‌

భారతదేశం కోవిడ్‌-19 ఎమర్జెన్సీ సన్నాహక ప్యాకేజీతో
జాతీయ, రాష్ట్ర ఆరోగ్య వ్యవస్ధలను పటిష్టం చేసేందుకు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శ్రీకారం చుట్టారు.

కేంద్రం మూడు దశల్లో 2020 జనవరి నుంచి 2024 మార్చి వరకు నిధులను కేంద్ర ప్రభుత్వం భరిస్తుందని జాతీయ ఆరోగ్య మిషన్‌ డైరెక్టర్‌ వందన గుర్నానీ ప్రకటించారు.

ఈ నిధులతో వ్యాధి నివారణ, ముందస్తు సన్నద్ధతలు, అత్యవసర వైద్య పరికరాలు సమకూర్చుకోవడం, మందుల సేకరణ, లేబొరేటరీలు, బయో సెక్యూరిటీ అందుబాటులో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటారు. తొలి దశ అమలు జూన్‌ వరకూ కొనసాగుతుందని రాష్ట్రాల వైద్య శాఖ సంచాలకులు, కమిషనర్లకు పంపిన ఉత్తర్వుల్లో తెలిపారు.