ఏప్రిల్ 15నుంచి విమానాల రాకపోకలు

దేశీయంగా విమాన సర్వీసులు ఏప్రిల్ 15నుంచి పునరుద్ధరిస్తున్నారు. కేంద్ర విమానయాన మంత్రి
హర్దీప్‌సింగ్‌ ప్రకటనతో ఇప్పటికే విమానయాన సంస్థలు
అడ్వాన్స్ బుకింగ్‌లను ప్రారంభించాయి. కానీ ఏయిర్ ఇండియా మాత్రం దేశీయ, విదేశీ మార్గాల్లోనూ ఏప్రిల్ 30 వరకు బుకింగ్‌లను తీసుకోబోమని ప్రకటించింది. లాక్‌డౌన్‌ పూర్తయిన తర్వాత తీసుకోబోయే నిర్ణయం ప్రకారం ప్రయాణీకులు బుకింగ్ చేసుకునే అవశాలున్నాయి. కరోనా రక్కసి, మహామ్మారి విలయతాండవం కారణంగా మన దేశంలో మార్చి 24 నుంచి విమాన సర్వీసులు నిలిచిపోయాయి.