52వ ‘ఐఎఫ్‌ఎఫ్ఐ-2021’లో ఇండియన్‌ పనోరమ చిత్రాలు

52వ ‘ఐఎఫ్‌ఎఫ్ఐ-2021’లో ఇండియన్‌ పనోరమ చిత్రాలు

గోవాలో నిర్వహించే 52వ అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో భాగంగా ‘ఇండియన్ పనోరమ’ విభాగంలో ప్రదర్శించే చిత్రాల అధికారిక జాబితా ప్రకటించబడింది. భారత ప్రభుత్వ సమాచార-ప్రసార మంత్రిత్వశాఖ పరిధిలోని భారత చలనచిత్రోత్సవాల డైరెక్టరేట్‌ గోవా రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో నిర్వహించే ఈ వేడుకలు 2021 నవంబరు 20-28 తేదీల మధ్య జరుగుతాయి. గోవాలో 9 రోజులపాటు సాగే ఈ చిత్రోత్సవాల కోసం ఎంపిక చేసిన చిత్రాలు వివిధ చలనచిత్ర రంగాల నుంచి పేర్లు నమోదు చేసుకున్న అతిథులు-ప్రతినిధులకు ప్రదర్శించబడతాయి.

నాటకీయ, ఇతివృత్తసహిత, రసజ్ఞపూర్వక కథా, కథేతర చిత్రాలను ఇండియన్‌ పనోరమ ఎంపిక చేసి ప్రదర్శిస్తుంది. ఇలా వివిధ విభాగాల కింద ఈ చిత్రాలను లాభాపేక్షరహితంగా ప్రదర్శించడం ద్వారా చలనచిత్ర కళను ప్రోత్సహించడం దీని లక్ష్యం. ఈ చలనచిత్రోత్సవాలు ప్రారంభమైనప్పటి నుంచీ ఆ సంవత్సరానికి చెందిన అత్యుత్తమ భారతీయ చిత్రాలను ప్రదర్శించడంపైనే ఇండియన్ పనోరమ పూర్తిగా దృష్టి సారించింది. భారతీయ చలనచిత్ర రంగానికి చెందిన ప్రముఖ చిత్ర నిర్మాతలు, నిపుణులు ఈ ఎంపిక సంఘంలో సభ్యులుగా ఉంటారు. ఆ మేరకు కథా, కథేతర చిత్రాల ఎంపికలో ఆయా సంఘాల సభ్యులు తమ వ్యక్తిగత నైపుణ్యం, అనుభవం ప్రాతిపదికగా ఇండియన్‌ పనోరమ కింద ప్రదర్శించాల్సిన చిత్రాలను ఎంపిక చేస్తారు.

 

కథా చిత్రాలు

1. కాకొక్ఖో, బెంగాలీ, రాజ్‌దీప్ పాల్ & శర్మిష్ట మైతీ

2. నీతాంటోయ్ సహజ్ సరళ. బెంగాలీ, సత్రాబిట్ పాల్

3. అభిజాన్, బెంగాలీ, పరంబ్రత ఛటోపాధ్యాయ

4. మాణిక్‌బాబుర్‌ మేఘ్, బెంగాలీ, అభినందన్ బెనర్జీ

5. సిజౌ, బోడో, విశాల్ పి. చలిహా

6. సెమ్‌ఖోర్‌, దిమాసా, ఐమీ బారువా

7. 21స్ట్‌ టిఫిన్, గుజరాతీ, విజయగిరి బావా

8. ఎయిట్ డౌన్ తూఫాన్ మెయిల్, హిందీ, ఆకృతి సింగ్

9. ఆల్ఫా బీటా గామా, హిందీ, శంకర్ శ్రీకుమార్

10. డొల్లు, కన్నడ, సాగర్ పురాణిక్

11. తలేదండ, కన్నడ, ప్రవీణ్ కృపాకర్

12. యాక్క్‌-1978, కన్నడ, మంజునాథ ఎస్. (మన్సూర్)

13. నీలి హక్కీ, కన్నడ, గణేష్ హెగ్డే

14. నిరయే తతకలుల్ల మరమ్, మలయాళం, జయరాజ్

15. సన్నీ, మలయాళం, రంజిత్ శంకర్

16. ఎంఇ వసంతరావు, మరాఠీ, నిపుణ్‌ అవినాష్ ధర్మాధికారి

17. బిట్టర్ స్వీట్, మరాఠీ, అనంత్ నారాయణ్ మహదేవన్

18. గోదావరి, మరాఠీ, నిఖిల్ మహాజన్

19. ఫ్యూనరల్‌, మరాఠీ, వివేక్ రాజేంద్ర దూబే

20. నివాస్, మరాఠీ, మెహుల్ అగజా

21. బూంబా రైడ్, మిషింగ్‌, బిశ్వజీత్ బోరా

22. భగవదజ్జుకం, సంస్కృతం, యదు విజయకృష్ణన్

23. కూళంగళ్‌, తమిళం, వినోద్‌రాజ్ పి.ఎస్.

24. నాట్యం, తెలుగు, రేవంత్ కుమార్ కోరుకొండ

25. డిక్షనరీ, బెంగాలీ, బ్రత్యబసు

ప్రస్తుత ‘ఐఎఫ్‌ఎఫ్‌ఐ’లో ప్రదర్శన కోసం 25 కథాచిత్రాలు ఎంపిక చేయబడ్డాయి. సమకాలీన భారతీయ భాషా చిత్రాల విస్తృత సమాహారంలోని 221 చిత్రాల నుంచి ఎంపిక చేసి, ఈ కథాచిత్రాలన్నీ భారతీయ చలనచిత్ర పరిశ్రమ చైతన్యం, వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తాయి. కథాచిత్రాల ఎంపిక సంఘంలో 12 మంది సభ్యులుండగా, ప్రసిద్ధ చిత్ర నిర్మాత-నటుడు శ్రీ ఎస్‌.వి.రాజేంద్ర సింగ్‌ బాబు దీనికి నేతృత్వం వహించారు. విభిన్న భారతీయ చలనచిత్ర నిర్మాణ సౌభ్రాత్రాన్ని చాటుతూ ప్రశంసలు పొందిన చలనచిత్రాలు, నిర్మాణ సంస్థలు, వృత్తులకు స్వయంగా ప్రాతినిధ్యం వహించే కింది ప్రముఖులు ఈ ఎంపిక సంఘంలో సభ్యులుగా ఉన్నారు:

శ్రీ రాజేంద్ర హెగ్డే, ఆడియోగ్రాఫర్

శ్రీ మఖోన్మణి మోంగ్‌సబా, చిత్రనిర్మాత

శ్రీ వినోద్ అనుపమ, సినీ విమర్శకుడు

శ్రీమతి జయశ్రీ భట్టాచార్య, చిత్ర నిర్మాత

శ్రీ జ్ఞాన్ సహాయ్, సినిమాటోగ్రాఫర్

శ్రీ ప్రశాంతను మహాపాత్ర, సినిమాటోగ్రాఫర్

శ్రీ హేమేంద్ర భాటియా, నటుడు/రచయిత/చిత్రనిర్మాత

శ్రీ అసిమ్ బోస్, సినిమాటోగ్రాఫర్

శ్రీ ప్రమోద్ పవార్, నటుడు, చిత్ర నిర్మాత

శ్రీ మంజునాథ్ టి.ఎస్., సినిమాటోగ్రాఫర్

శ్రీ మలయ్ రే, చిత్రనిర్మాత

శ్రీ పరాగ్ ఛపేకర్, చిత్ర నిర్మాత/పాత్రికేయులు

 

కథేతర చిత్రాలు

1. వీరాంగన, అస్సామీ, కిషోర్ కలిత

2. నాద్- ది సౌండ్‌, బెంగాలీ, అభిజిత్ ఎ.పాల్

3. సైన్బారి టు సందేశ్‌ఖలీ, బెంగాలీ, సంఘమిత్ర చౌదరి

4. బాదల్ సిర్కార్ & ఆల్టర్నేటివ్ థియేటర్, ఆంగ్లం, అశోక్ విశ్వనాథన్

5. వేద్… ది విజనరీ, ఆంగ్లం, రాజీవ్ ప్రకాష్

6. సర్‌మౌంటింగ్‌ చాలెంజెస్‌, ఆంగ్లం, సతీష్ పాండే

7. సన్పట్, గర్వాలీ, రాహుల్ రావత్

8. ది స్పెల్ ఆఫ్ పర్పుల్, గుజరాతీ, ప్రాచీ బజానియా

9. భరత్, ప్రకృతి కా బాలక్, హిందీ, డా. దీపికా కొఠారి-రామ్‌జీ

10. తీన్ అధ్యాయ్, హిందీ, సుబాష్ సాహూ

11. బబ్లూ బాబిలోన్ సే, హిందీ, అభిజీత్ సారథి

12. ది నాకర్, హిందీ, అనంత్ నారాయణ్ మహదేవన్

13. గంగా-పుత్ర, హిందీ, జై ప్రకాష్

14. గజ్రా, హిందీ, వినీత్ శర్మ

15. జుగల్బందీ, హిందీ, చేతన్ భకుని

16. పబుంగ్ శ్యామ్, మణిపురి, హౌబం పబన్ కుమార్

17. మర్మర్స్ ఆఫ్ ది జంగిల్, మరాఠీ, సోహిల్ వైద్య

18. బ్యాక్‌స్టేజ్‌, ఒరియా, లిప్కా సింగ్ దారై

19. విచ్‌

భారతీయ చలనచిత్ర పరిశ్రమలోని కథేతర విభాగాలతో అనుసంధానంగల ప్రముఖ ఎంపిక సంఘం సభ్యులు ఎంపిక చేసిన సమకాలీన సామాజిక, రసజ్ఞ, ఉత్తేజిత కథేతర చిత్రాలు అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల ఇండియన్ పనోరమ విభాగ సమాహరంగా ఉంటాయి. కథేతర చిత్రాల ఎంపికకు ఏర్పాటైన ఏడుగురు సభ్యుల ఎంపిక సంఘానికి ప్రముఖ డాక్యుమెంటరీల నిర్మాత శ్రీ ఎస్‌.నల్లముత్తు నాయకత్వం వహించారు. సంఘంలో కింది ప్రముఖులు సభ్యులుగా ఉన్నారు:

శ్రీ ఆకాశాదిత్య లామా, చిత్ర నిర్మాత

శ్రీ సిబాను బోరా, డాక్యుమెంటరీ చిత్ర నిర్మాత

శ్రీ సురేష్ శర్మ, సినిమా నిర్మాత

శ్రీ సుబ్రత్ జ్యోతి నియోగ్, చిత్ర విమర్శకులు

శ్రీమతి మనీషా కులశ్రేష్ఠ, రచయిత్రి

శ్రీ అతుల్ గంగ్వార్, రచయిత

సమకాలీన భారతీయ భాషా చిత్రాల విస్తృత సమాహారంలోని 203 చిత్రాల నుంచి ఎంపిక చేసిన, ఈ కథేతర చిత్రాలన్నీ భారతీయ చలనచిత్ర పరిశ్రమలోని ప్రముఖ, వర్ధమాన చిత్రనిర్మాతల సామర్థ్యాన్ని ప్రస్ఫుటం చేస్తూ వినోదంతోపాటు అధ్యయనం, నమోదు చేయదగిన భారతీయ విలువలను ప్రతిబింబిస్తాయి.