కాజీపేట-హైదరాబాద్ మధ్య సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ నడపాలి.

కాజీపేట-హైదరాబాద్ మధ్య సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ నడపాలి.

లోక్ సభలో కాజీపేట- హైదరాబాద్ మధ్య కొత్త సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ను ప్రారంభించాలని ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ప్రస్తావించారు. ఈ మార్గంలో రైలు నడిపితే వేలాదిమంది ప్రయాణికులు, విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపార వర్గాలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. శ్రీ లక్ష్మీనరసింహ స్వామి భక్తుల సౌకర్యార్ధం భువనగిరిలో నిలపాలి అలాగే

భువనగిరి, ఆలేరు, జనగాం స్టేషన్లలో రైలు ఆపేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు. ఆలేరు, జనగామ, భువనగిరి లాంటి మూడు పట్టణాలను కలుపుతూ కాజిపేట- హైదరాబాద్ మధ్య కొత్త సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ను ప్రారంభించాలి.
ఈ ప్రత్యేక రైలు నడిపితే ప్రయాణికులకు ఉపయోగంతో
పాటు రైల్వే శాఖకు మంచి ఆదాయాన్ని సమకూరుతుందని కోమటిరెడ్డి అన్నారు.