రైల్వేస్ రన్ రాజా రన్

దేశ‌వ్యాప్తంగా స‌ర‌కు ర‌వాణా కార్య‌క‌లాపాల‌కు మ‌రింత ఊతం ఇచ్చే విధంగా, నిత్యావ‌స‌ర స‌ర‌కుల‌ను ఎలాంటి అడ్డంకులు లేకుండా నిరంత‌రాయంగా దేశంలోని వివిధ ప్రాంతాల‌కు చేర‌వేసేందుకు భార‌తీయ రైల్వే, నిర్దేశిత వేళ‌ల్లో న‌డిచే పార్శిల్ రైళ్ల‌ను ప్ర‌వేశ‌పెట్టింది. ఇది సామాన్య ప్ర‌జ‌లు, ప‌రిశ్ర‌మ‌లు, వ్య‌వ‌సాయ రంగానికి అవ‌స‌రమైన కీల‌క స‌ర‌కులు అందుబాటును మ‌రింత పెంచ‌నుంది.

సుమారు 58 రూట్ల‌లో (109 రైళ్లు) పార్శిల్ స్పెష‌ల్ రైళ్ల‌ను , లాక్ డౌన్ ప్ర‌క‌టించిన త‌ర్వాత‌ నుంచి నోటిఫైచేశారు. 2020 ఏప్రిల్ 5 నాటికి, 27 రూట్లు నోటిఫై చేశారు. ఇందులో 17 రూట్లు రెగ్యుల‌ర్ షెడ్యూల్డు స‌ర్వీసులు కాగా మిగిలినవి సింగిల్ ట్రిప్ కు సంబంధించిన‌వి. ఆతర్వాత‌, 40 కొత్త రూట్ల‌ను గుర్తించి, నోటిఫై చేశారు. (ఇంత‌కు ముందు నోటిఫై చేసిన కొన్ని రూట్ల‌లో న‌డిచే పార్శిల్ రైళ్ల ఫ్రీక్వెన్సీని పెంచారు)దీనితో దేశంలోని దాదాపు అన్ని ప్ర‌ధాన న‌గ‌రాలు వేగంగా కీల‌క స‌ర‌కు ర‌వాణాతో అనుసంధాన‌మయ్యాయి. ఈ సేవ‌లు ముందు ముందు మ‌రింత పెంచ‌నున్నారు.

క‌స్ట‌మ‌ర్ల డిమాండ్‌కు అనుగుణంగా టైంటేబుల్ ఆధారిత పార్శిల్ రైళ్ల‌ను ప్ర‌తిపాదించారు. టైం టేబుల్ పార్శిల్ రైళ్లను దేశంలోని కీల‌క కారిడార్లు అయిన ఢిల్లీ, ముంబాయి, కోల్‌క‌తా, చెన్నై,హైద‌రాబాద్‌, బెంగ‌ళూరు వంటి కీల‌క కారిడార్ల‌తో అనుసంధానం చేశారు. దీనితోపాటు దేశంలోని ఈశాన్య ప్రాంతాల‌కు స‌ర‌కు ర‌వాణాకు వీలుగా, గౌహ‌తితో త‌గిన అనుసంధాన‌త క‌ల్పించారు. ఈ రైళ్ల ద్వారా ఇత‌ర ప్ర‌ధాన న‌గ‌రాలైన భోపాల్‌, అల‌హాబాద్, డెహ్రాడూన్‌, వార‌ణాశి, అహ్మ‌దాబాద్‌, వ‌డోద‌ర‌, రాంచి, గోర‌ఖ్‌పూర్,తిరువ‌నంత‌పురం,సేలం, వ‌రంగ‌ల్‌, విజ‌య‌వాడ‌, విశాఖ‌ప‌ట్నం, రూర్కేలా, బిలాస్‌పూర్‌, భుసావాల్, టాటాన‌గ‌ర్‌, జైపూర్‌, ఝాన్సీ, ఆగ్రా, నాసిక్‌, నాగ‌పూర్‌, అకోలా, జ‌ల్‌గాన్‌, సూర‌త్‌,పూణె, రాయ్‌పూర్‌, పాట్నా, అస‌న్‌సోల్‌, కాన్పూర్‌, జైపూర్‌, బిక‌నీర్‌, అజ్మీర్‌, గ్వాలియ‌ర్‌, మ‌థుర‌, నెల్లూరు, జ‌బ‌ల్‌పూర్ త‌దిత‌రాలతో అనుసంధాన‌మై ఉన్నాయి.

క‌స్ట‌మ‌ర్ల డిమాండ్‌కు అనుగుణంగా భార‌తీయ రైల్వేలు ఇత‌ర పార్శిల్ రైళ్ల‌ను ఇదే స‌మ‌యంలో న‌డుపుతోంది. వాటిలో
కింది స‌ర్వీసులు ఉన్నాయి.

A) పాల స‌ర‌ఫ‌రా స్పెష‌ల్‌- పాలంపూర్ (గుజ‌రాత్‌) నుంచి ఢిల్లీ సమీపంలోని పాల్వాల్ వ‌ర‌కు, రేణిగుంట (ఎపి)నుంచి ఢిల్లీ
B) పాల ఉత్ప‌త్తులు గుజ‌రాత్ లోని కంకారియా నుంచి కాన్పూర్ (యుపి) , అలాగే కోల్‌క‌తాస‌మీపంలోని సంక్రాల్ వ‌ర‌కు
C) ఆహార ఉత్ప‌త్తుల‌ను పంజాబ్ లోని మొగా నుంచి అస్సాంలోని చాంగ్‌స‌రి వ‌ర‌కు
టైమ్ టేబుల్ ప్ర‌కారం న‌డిపే పార్శిల్ రైళ్ల‌ను ఈ రూట్ల‌లో కూడా న‌డుపుతున్నారు. డిమాండ్ త‌క్కువ‌గా ఉన్న రూట్ల‌లో కూడా వీటిని న‌డుపుతున్నారు. దీనివ‌ల్ల దేశంలోని ఏప్రాంతం అనుసంధాన‌త లేకుండా లేదు. కొన్ని రైళ్ల‌ను కేవ‌లం రెండు పార్శిల్ వ్యాన్ల‌తో లేదా 1 పార్శిల్ వ్యాన్ లేదా బ్రేక్ వ్యాన్‌తో న‌డుపుతున్నారు.