భారతదేశంలో 10 కరోనా అత్యధిక రాష్ట్రాలు

ప‌ది రాష్ట్రాల్లో క‌రోనా జోరు-ప్ర‌జ‌లు బేజారు
క‌రోనాలో ‘మ‌హా’ రాష్ట్ర అగ్ర‌స్థానం
తెలుగు రాష్ట్రాల్లో క‌రోనా వీరంగం

క‌రోనా వైర‌స్ భార‌తదేశాన్ని నాకుదిక్కులా చుట్టుముట్టింది. క‌రోనా వైర‌స్ క‌ట్ట‌డి విష‌యంలో బ‌య‌టి దేశాల‌తో పోలిస్తే మ‌న‌ము మెరుగైన స్థితిలో ఉన్న‌ప్ప‌టికీ కేసుల న‌మోదు విష‌యంలో ప‌రుగుల వ‌ర‌ద‌లా వేగాన్ని అందుకోవ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది. ఇప్పటికీ ఇంకా రాపిడ్ టెస్టులు చేయడం లేదు, కరోనా నిర్ధారణ కిట్లు పూర్తిగా వేగవంతంగా చేసేందుకు కృషి జరుగుతోంది. ఇంటింటికి వెళ్లి కరోనా వైరస్ పరీక్షల కార్యాచరణ జరగాల్సి ఉండగా దేశంలో ఏప్రిల్167 వరకు 13,625 క‌రోనా వైర‌స్ కేసులు న‌మోదు అవ‌గా,

11,397 పాజిటీవ్ కేసులు న‌మోదు అయ్యాయి. ఇక డిశ్చార్జి విష‌యానికి వ‌స్తే 1,778 మంది నెగెటీవ్ రిపోర్టుల‌తో ప్రాణాపాయం నుంచి బ‌తికి బ‌య‌ప‌డ్డారు. మ‌న‌దేశంలో 29 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాలు ఉండ‌గా, ముఖ్యంగా ప‌ది రాష్ట్రాల్లో క‌రోనా వైర‌స్ విల‌య‌తాండ‌వం చేస్తోంది.

దేశంలో కరోనా విలయతాండవం చేస్తోన్న టాప్ ప‌ది రాష్ట్రాల్లో మ‌హారాష్ట్ర అగ్ర‌స్థానంలో ఉండ‌గా, మ‌న తెలుగు రాష్ట్రాలు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ‌లు కూడా వ‌రుస‌లో నిలిచాయి. కాగా, ఇప్ప‌టి వ‌ర‌కు మ‌న దేశంలో 450 మంది క‌రోనా బారిన ప‌డి మృత్యుపాల‌య్యారు. మ‌న దేశంలో అత్య‌ధికంగా క‌రోనా పాజిటీవ్‌కేసులు, మ‌ర‌ణాలు మ‌హారాష్ట్ర‌లోనే చోటుచేసుకున్నాయి. మ‌హారాష్ట్ర‌లో మొత్తం 3202 క‌రోనా కేసులు న‌మోదు అవ‌గా 2,708 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. 300 మంది బాధితులు డిశ్చార్జ్ అవ‌గా, 194 మంది క‌రోనా కాటుకు బ‌ల‌య్యారు.

ద్వితీయ స్థానంలో ఉన్న ఢిల్లీలో 1640 కేసులు న‌మోదు అవ‌గా, 1550 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. 52 మంది కోలుకోగా, 38 మంది మృత్యువాత ప‌డ్డారు.

మూడో స్థానంలో త‌మిళ‌నాడులో 1267 కేసులు న‌మోదు అవ‌గా, 1072 పాజిటీవ్ కేసులు ఉన్నాయి. 180 మంది క‌రోనా వైర‌స్ నుంచి కోలుకోగా, 15 మంది మృతి చెందారు.

4వ స్థానంలో నిలిచిన రాజ‌స్థాన్‌లో 1169 క‌రోనా కేసులు న‌మోదు అవ‌గా, 994 మందికి పాజిటీవ్ వ‌చ్చింది. 164 మంది కోలుకోగా, 11 మంతి క‌రోనా కాటుకు బ‌ల‌య్యారు.

5వ స్థానంలో మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో 1164 క‌రోనా కేసులు న‌మోదు అవ‌గా, 1039 పాజిటీవ్ కేసులు న‌మోదు అయ్యాయి. మొత్తం 70 మంది రోగులు డిశ్చార్జి అయ్యారు. 55 మంది క‌రోనా వైర‌స్ తో మృతి చెందారు.

6వ స్థానంలో గుజ‌రాత్‌లో మొత్తం1021 క‌రోనా కేసులు న‌మోదు కాదు, 909 యాక్టీవ్ కేసులు న‌మోదు అయ్యాయి. 74 మంది కోలుకోగా, 38 మంతి మృతి చెందారు.

దేశంలోని అతి పెద్ద రాష్ట్ర‌మైన ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌ ఏడ‌వ స్థానంలో నిలిచింది. ఈ రాష్ట్రంలో క‌రోనా కేసులు 805కు ప‌రిమిత‌వ‌డం ఊర‌ట‌నిస్తోంది. అయితే ఇక్క‌డ 724 యాక్టీవ్ కేసులు న‌మోదు అయ్యాయి. 68 మంది కోలుకుని డిశ్చార్జి కాగా, 13 మంది మృతి చెందారు.

8వ స్థానంలో ఉన్న తెలంగాణ‌లో మొత్తం 700 క‌రోనా కేసులు న‌మోదు కాగా, 495 పాజిటీవ్ కేసులుగా న‌మోదు అయ్యాయి. 187 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. క‌రోనా వైర‌స్‌తో 18 మంది మృత్యువాత‌ప‌డ్డారు.

9వ స్థానంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో 572 క‌రోనా కేసులు న‌మోదు కాగా, 538 పాజిటీవ్ కేసులు న‌మోదు అయ్యాయి. 20 మంది డిశ్చార్జి అవ‌గా, 14 మంది మృతి చెందారు.

10వ స్థానంలో నిలిచిన కేర‌ళ‌లో 394 క‌రోనా కేసులు న‌మోదు అయ్యాయి. 147 పాజిటీవ్ కేసులుగా తేల‌గా, చికిత్స పొందుతూ కోలుకుని 245 మంది డిశ్చార్జి అయ్యారు. కేర‌ళ‌లో కేవ‌లం ఇరువురు మాత్ర‌మే మృతి చెంద‌డం ఆ రాష్ట్ర ప్ర‌భుత్వం తీసుకుంటున్న క‌రోనా వ్య‌తిరేక చ‌ర్య‌లు, వైద్యుల ప‌నితీరుకు అద్దం ప‌డుతుంది.