ఏడారి దేశాల్లో భారతీయుల అవస్థలు

అరబ్ దేశాల్లోని భారతీయులు కరోనా మహామ్మారి కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దుబాయి లాంటి దేశానికి విజిట్ వీసాపై పెద్ద సంఖ్యలో భారతీయ కార్మికులు యుఎఇకి వెళ్లారు. కానీ కోవిడ్19 మహమ్మారి విరుచుకు పడటంతో పని లేకుండా దాదాపు వందల మంది చిక్కుకున్నారు. ఈ విపత్కర పరిస్థితుల్లో ఆపన్న హస్తంగా దుబాయిలోని భారతీయ కాన్సులేట్ 2250 కిలోల బియ్యం, 1000 కిలోల గోధుమ పిండి, 700 కిలోల పప్పు దినుసులు మరియు ఇతర ఆహార పదార్థాలను సరఫరా చేసింది.