కరోనా యుద్ధంలో కలిసిస్తోన్న వరాలు/భారతీయులకు మాత్రమే..

కరోనా మహామ్మారిని ఎదుర్కొనేందుకు భారత దేశంకు కలిసి వస్తోన్న అంశాలు చాలా ఉన్నాయి. ప్రపంచాన్నే వణికిస్తోన్న మహామ్మారి కారణంగా మన దేశంలో కూడా పట్టణ ప్రాంతాల్లో అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయి. కానీ గ్రామాల్లో ప్రభావం మాత్రం అంతంత మాత్రమే. ఇండియాలో ఏప్రిల్17 ఉదయం 8గంటల వరకు ఇప్పటికే కరోనా 13, 387 కేసులు 437 మంది మృత్యువాత పడ్డారు. కానీ 325 జలాల్లో అసలు కరోనా చాయలే లేవని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. ఐతే 130కోట్ల జనాభాలో ఈ అత్యంత భయానకమైన వైరస్ గుర్తించేందుకు అందరూ డిమాండ్ చేస్తోంది ఒక్కటే కరోనా సోకిందా లేదా వైద్య పరీక్షలు వేగంగా చేపట్టాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇంటింటికి తిరిగి కరోనా సమాచారం సేకరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఏదేమైనా ప్రతి విషయంలో ప్రకృతి వరప్రసాదాలు అందుబాటులో కొన్ని ఉంటాయి అందులో మనకు కలిసి వస్తోన్న అంశాలు కింది విధంగా ఉన్నాయి.

మన దేశం ఉష్ణ మండలంలో ఉండటం. అందులో ప్రస్తుతం ఎండాకాలం కొనసాగుతుండటంతో 35- 40డిగ్రీలకు తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవ్వడం లేదు. కరోనా వైరస్ సూక్ష్మ జీవిపై నుండే కొవ్వు పదార్థం ఈ వేడి వాతావరణంలో ఎక్కువ సేపు జీవించడం కష్టమని పరిశోధనల్లో తేలింది. అమెరికా, ఐరోపా దేశాలు శీతల దేశాలు కావడంతో కోవిడ్-19 విజృంభన అధికంగా ఉంది. అంతే కాకుండా ముందుగానే గుర్తించకపోవడం నిర్లక్ష్యం కారణంగా వేగంగా ప్రబలుతోంది.

క‌రోనా వైర‌స్ విజృంభ‌న నేప‌థ్యంలో హైడ్రాక్సీక్లోరోక్విన్‌ ఔష‌దం ఇప్పుడు ప్ర‌పంచ దేశాల‌కు సంజీవ‌నిగా మారింది. ప్ర‌పంచాన్ని అత‌లాకుత‌లం చేస్తున్న క‌రోనా వైర‌స్ మహామ్మారికి అడ్డుకట్ట వేయ‌డానికి మందు లేదు. వ్యాక్సిన్ ఇంకా ప‌రిశోధ‌న ద‌శ‌లో ఉంది. అయితే నివార‌ణ‌కు ప్ర‌స్తుతం అందుబాటులో ఉన్న హైడ్రాక్సీక్లోరోక్విన్‌ మందుతో పాటు అజిత్రోమైసిన్ ఔష‌దాన్ని వినియోగిస్తూ వైర‌స్ నుంచి బాధితుల‌ను ప్రాణాపాయం నుంచి త‌ప్పించే ప‌ని యుద్ద‌ప్రాతిప‌దిక‌న సాగుతోంది. క‌రోనా వైర‌స్‌కు విరుగుడుగా ప్ర‌చారంలో ఉన్న సంజీవని హైడ్రాక్సీక్లోరోక్వీన్ కోసం ప్ర‌పంచ దేశాలు భార‌త్ వైపు ధీనంగా ఆర్థిస్తున్నాయి.

 

న‌వ‌జాత శిశువుల‌కు ఎలాంటి వ్యాధులు సంక్ర‌మించ‌కుండా టీకాలు వేసేవారు. ముఖ్యంగా క్ష‌య వ్యాధి సంక్ర‌మించ‌కుండా రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచ‌డానికి టీకా వేయించేవారు.ఆ కాలంలో భుజానికి టీకా వేస్తే ఓ మ‌చ్చ‌లా గుర్తుండి పోయేది. అలాంటి వందేళ్ల నాటి బీసీజీ (బాసిల్లోస్‌ కాల్మెట్టే గురిన్‌) వ్యాక్సిన్ ఇప్పుడు ప్ర‌పంచ వ్యాప్తంగా స‌ర్వ‌త్రా చ‌ర్చానీయంశ‌మైంది. క‌రోనా వైర‌స్ కాటుకు ముఖ్యంగా రోగ‌ నిరోధ‌క‌శ‌క్తి త‌క్కువ‌గా ఉన్న‌వారు బ‌ల‌వుతున్నారు. గ‌తంలో రోగాల బారిన ప‌డిన‌వారు, వృద్ధులు, పౌష్టికాహారం లోపంతో బ‌ల‌హీనంగా ఉండేవారు. వైర‌స్ సంక్రమించిన త‌రువాత తీవ్ర అనారోగ్యం పాల‌వుతున్నారు. ఇలాంటి వారికి రోగ‌నిరోధ‌క శ‌క్తిని పెంచ‌డానికి ఉప‌యోగ‌ప‌డే వైద్యాన్ని అందిస్తున్నారు. హైడ్రాక్సీక్లోరోక్వీన్‌తో పాటు యాంటిబైటిక్ అజిత్రోమైసిన్ ఔష‌దాల‌ను అందిస్తున్నారు. మ‌రోవైపు వందేళ్ల నాటి బీసీజీ వ్యాక్సిన్‌పై కూడా ప్ర‌పంచ దేశాలు క‌రోనా వైర‌స్ చికిత్సకు ప్ర‌యోగాలు మొద‌లు పెట్టాయి. ఈ నేప‌థ్యంలో అస‌లు బీసీజీ వ్యాక్సిన్ క‌థ‌క‌మామీషు తెలుసుకుందామా..

బీసీజీ వ్యాక్సిన్ అంటే ఏమిటీ?
బాసిల్ల‌స్ కాల్మెట్ గురిన్ (బిసిజి) ఒక టీకా. క్ష‌య (టిబి) వ్యాధి న‌యం చేయ‌డానికి ఈ టీకా వేస్తారు. ఆరోగ్య‌క‌ర‌మైన శిశువుల‌కు పుట్టుట‌కు ద‌గ్గ‌ర‌గా ఉన్న‌వారికి వ్యాక్సిన్ ఇవ్వ‌డానికి వైద్యులు సిఫార్సు చేస్తారు. ఈ టీకాను ఇంజ‌క్ష‌ను రూపంలో ఇస్తారు. టీబీకి వ్య‌తిరేకంగా రోగ‌నిరోధ‌క శ‌క్తిని పెంచుతారు. ఈ వ్యాక్సిన్‌ను మూత్రాశ‌య క్యాన్స‌ర్ చికిత్స‌కు కూడా ఉప‌యోగిస్తారు. ఈ టీకా ప్ర‌పంచంలోని అత్యంత విజ‌య‌వంత‌మైన రోగ‌నిరోధ‌క చికిత్స‌ల‌లో ఒక‌టిగా నిలిచింది. అయితే ఈ టీకా ఉప‌యోగాలు, ప్ర‌భావాల‌నేవి వ్య‌క్తి వ్య‌క్తికి మార‌వ‌చ్చు. ఈ టీకాను ఉప‌యోగించే ముందు Pulmonologist ను సంప్ర‌దించ‌డం అనివార్యం.

భారతదేశంలో యువత ఎక్కువగా ఉన్నారు. మొత్తం జనాభా యువ భారత్ శాతం పరిశీలిస్తే 60%పైగానే మనం యువతి యువకులను కలిగున్న దేశంగా భూమండలంలో రికార్డులు సొంతం చేసుకున్నాం. ఈ విషయాలు ఎందుకంటే ప్రపంచంలో ఏప్రిల్ 17 నాటికి 21,82,823 మంది కరోనా బారిన పడగా 1,45,551మంది మృతి చెందారు. ఈ గణాంకాల ప్రకారం అత్యధికంగా వృద్ధులు కోవిడ్-19 కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలున్నాయని తేలింది. అందుకే కరోనా కాలంలో యువ భారత్ కలిసి వచ్చిన అంశంగా చెప్పుకోవచ్చు.

ప్రపంచ వ్యాప్తంగానే కాకుండా మన దేశంలో కూడా కరోనా సోకిన కేసుల వివరాలను పరిశిస్తే 13,387 మంది నమోదవగా అత్యధికులు మెట్రో నగరాల్లోనే ఉన్నారు. ముందుగా ముంబాయి, ఢిల్లీ, చెన్నై, ఇండోర్, జైపూర్, హైదరాబాద్ వరుసలోన్నాయి. 325 జిల్లాల్లో ఐతే కేసులు నమోదు కాలేదు. అత్యధికంగా అంతర్జాతీయ నగరాలతో విమాన, సముద్ర మార్గాల్లో రాకపోకలున్న మహా నగరాలే టార్గెట్ అవుతున్నాయి. కానీ పల్లెసీమల్లో మాత్రం ప్రశాంత వాతావరణమే చాలా ఎక్కువ ప్రదేశాల్లో నమోదవుతోంది. అంతేకాకుండా ఈశాన్య రాష్ట్రాలు అత్యల్పంగా కరోనాతో పోరాడుతోన్న ప్రాంతాల జాబితాలోన్నాయి.

మన దేశంలోని దాదాపు 700 జిల్లాల్లో 325జిల్లాలు కరోనా వైరస్ మహామ్మారి సోకకుండా సురక్షితంగా ఉండటం మన భారతీయులు అందరికి ఓ తీపి కబురు.