కరోనా 1st మొబైల్ వైరాలజీ ల్యాబ్‌ అభివృద్ధిలో MEIL సంస్థ ఐకామ్ TELE-DRDOతో జత.

కరోనా యుద్ధంలో పోరాడేందుకు 1st మొబైల్ వైరాలజీ ల్యాబ్‌ అభివృద్ధిలో మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (MEIL) సంస్థ ఐకామ్ TELE దేశంలో ప్రతిష్టాత్మకమైన DRDOతో జతకట్టి కృషి చేసింది.

దేశంలోనే ‘తొలి మొబైల్‌ వైరాలజీ ల్యాబ్’ను కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ ఆన్‌ లైన్‌లో ప్రారంభించారు. హైదరాబాద్‌ ఈఎస్‌ఐ ఆసుపత్రిలో మన దేశంలో తొలి మొబైల్‌ వైరాలజీ ల్యాబ్‌ ఏర్పాటు చేసారు. కరోనా మహామ్మారి వైరస్ పరీక్షలు, వైరస్‌ కల్చర్‌, వ్యాక్సిన్‌ తయారీకోసం ఈ ల్యాబ్‌ను అందుబాటులో ఉంటుంది.

ఐ క్లీన్‌, ఐ సేఫ్‌, మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ సంస్థల సహకారంతో బయో సేఫ్టీ లెవెల్‌-3 ల్యాబ్‌ను డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ తయారు చేసింది.
DRDO శాస్త్రవేత్తలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని రెండు భారీ కంటైనర్లలో కేవలం 15 రోజుల్లో ఈ వ్యవస్థను అందుబాటులోకి తీసుకుని వచ్చారు.

ఈ ప్రారంభోత్సవ ONLINE కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి, సంతోష్‌ గంగ్వార్‌, తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్‌, DRDO ఉన్నతాధికారులు పాల్గొన్నారు.