దేశంలో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ ప్రస్తుత తీరుతెన్నులు, లాక్ డౌన్ అనంతర కాలంలో పరిశ్రమ అవసరాల గురించి చర్చించడానికి ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ & ఇండస్ట్రీ (FICCI) దాని సభ్యులతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌కు కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్, పరిశ్రమలశాఖ మంత్రి శ్రీమతి హర్ సిమ్రత్ కౌర్ బాదల్ అధ్యక్షత వహించారు.
కేంద్ర మంత్రి హర్ సిమ్రత్ కౌర్‌ను , ఫిక్కీ సెక్రటరీ జనరల్ శ్రీ దిలీప్ చెనోయ్ స్వాగతించారు .లాక్‌డైన్ ప్రారంభమైనప్పటి నుండి ఆహార పరిశ్రమకు ఆమె నిరంతరం సహకారం అందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
కోవిడ్ మ19 వ్యాప్తిని అరికట్టే చర్యలలో రాజీ పడకుండా పూర్తి సామర్థ్యంతో కార్యకలాపాలను పునరుద్ధరించడానికి పరిశ్రమ ప్రాముఖ్యతను కేంద్ర మంత్రి ఉదహరించారు. సీనియర్ అధికారులు ఇన్వెస్ట్ ఇండియా సభ్యుల నేతృత్వంలోని మంత్రిత్వ శాఖ టాస్క్ ఫోర్స్ ఇప్పటికే సమన్వయంతో పనిచేస్తోంది. పరిశ్రమ సభ్యులు , రాష్ట్రాలలో ఎదుర్కొంటున్న సమస్యలు, సవాళ్ల విషయంలో వారికి సహాయపడుతోంది..
దేశంలోని వివిధ ప్రాంతాల్లో పండించిన పంటలు , త్వరగా పాడైపోయే స్వభావంగల పంటలను రైతులు కోల్పేయే విషయమై హర్సిమ్రత్ కౌర్ బాదల్ ప్రధానంగా ప్రస్తావించారు, పండించిన గోధుమలు, వరి, పండ్లు, కూరగాయలు ఇతర పాడైపోయే వస్తువులను సేకరించడానికి పరిశ్రమలు ముందుకు రావాలని , తద్వారా రైతులకు ప్రయోజనం కల్పించాలని,కేంద్ర మంత్రి 2020 ఏప్రిల్ 28 న జరిగిన వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా ఫిక్కి సభ్యులందరినీ అభ్యర్థించారు.
కొన్ని విషయాలలో మంత్రిత్వ శాఖ తగిన జోక్యం చేసుకోవాలని కోరుతూ పరిశ్రమ సభ్యులు ఇప్పటికే తాము ఎదుర్కొంటున్న కొన్ని సమస్యలను ఈ సందర్భంగా ఉదహరించారు. వివిధ కంటైనర్ జోన్లలో ఆపరేటింగ్ సదుపాయాల కోసం ఎస్.ఒ.పి అవసరాలు చూడాలని, సవాళ్లను పరిష్కరించడానికి రాష్ట్ర స్థాయిలో ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమకు ప్రత్యేకంగా నోడల్ అధికారులు ఉండాలని, సౌకర్యాలను నిర్వహించడానికి సరఫరా గొలుసును నిర్వహించడానికి కార్మికుల పాస్‌ల జారీకి ప్రామాణిక ప్రోటోకాల్ ఉండాలని, కోవిడ్ క్లస్టర్లను గుర్తించే ప్రక్రియను పున: పరిశీలించాలని కోరారు..
ఆహార కర్మాగారాలు కంటైన్మెంట్ జోన్లలో పనిచేయడానికి వివరణాత్మక మార్గదర్శకాల అవసరం ఉందన్న దానిపై మంత్రి అంగీకరించారు, అలాగే పరిశ్రమ వర్గాలు, కార్మికుల రక్షణకు అవసరమైన చర్యలను చేపట్టగలిగితే . 60-75శాతం మంది కార్మికులను ఆయా సంస్థలలో పనిచేయడానికి అనుమతించాలనే ఆలోచనకూడా ఉంది. రిటైల్ పరిశ్రమను పునరుద్ధరించడానికి ఆలోచనలు కూడా తెలపాల్సిందిగా పరిశ్రమ వర్గాలను కోరారు.
పెద్ద విలువైన ఫుడ్ ప్యాక్‌ల డిమాండ్ ఇళ్లల్లో పెరగడం వల్ల ఆహార పరిశ్రమ వృద్ధిని సాధిస్తుందని, సరఫరా వ్యవస్జలు తిరిగి ప్రారంభమైన వెంటనే పరిశ్రమ పునరుద్ధరించడం ప్రారంభిస్తుందని సభ్యులు పేర్కొన్నారు.
దేశంలో క్లిష్ట సమయంలో ఆహార ఉత్పత్తుల సరఫరాను నిర్వహించడానికి సహకరించినందుకు ఫిక్కి , దాని సభ్యులకు, ఎప్.పి.ఐ కార్యదర్శి పుష్ప సుబ్రహ్మణ్యం ధన్యవాదాలు తెలిపారు. లాజిస్టిక్స్, గిడ్డంగి కార్యకలాపాలు, కార్మికులు, వాహనాల కదలికలకు సంబంధించిన సవాళ్లను పరిష్కరించడానికి అవసరమైన సూచనలను ప్రభుత్వం ఇప్పటికే జారీ చేసిందని ఆమె తెలిపారు. నిర్దిష్ట సమస్యలు ఏవైనా ఉంటే వాటి పరిష్కారం కోసం గ్రీవెన్స్ సెల్ దృష్టికి తేవాలని ఆమె సూచించింది.
అధిక శ్రామికశక్తిని పరిశ్రమలలో తిరిగి చేరడానికి ప్రభుత్వం అనుమతించడం విషయమై, పరిశ్రమ నుండి ఒక వర్కింగ్ మోడల్‌ను కూడా వారు ఆహ్వానించారు. ఆహార పరిశ్రమకు తోడ్పడే స్కీమ్‌ను రూపొందించేందుకు సభ్యుల నుండి సూచనలను కూడా ఆహ్వానించారు.
హేమంత్ మాలిక్, చైర్, ఫిక్కీ ఫుడ్ ప్రాసెసింగ్ కమిటీ , సిఇఒ-ఐటిసి ఫుడ్స్ డివిజన్ , ప్రముఖ పరిశ్రమ సభ్యులు సైమన్ జెరోజ్, ప్రెసిడెంట్ కార్గిల్ ఇండియా, టి కృష్ణకుమార్, కోకా కోలా ఇండియా, మోహిత్ ఆనంద్, కెల్లాగ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, ఇండియా మొండేలెజ్ ఇంటర్నేషనల్ దీపక్ అయ్యర్, సిటిఒ ఎంటిఆర్ ఫుడ్స్, సంజయ్ శర్మ, మేనేజింగ్ డైరెక్టర్ అమూల్, తరుణ్ అరోరా, సిఇఒ జైడస్ వెల్నెస్ తదితరులు, పరిశ్రమకు సంబంధించి ప్రస్తుత పరిస్థితులపై తమ అభిప్రాయాలను తెలియజేశారు. ఈ ఆలోచనలు మరింత ముందుకు సాగాలి.
అవసరమైన చర్యల కోసం ఈ సిఫార్సులను ఇప్పటికే సంబంధిత మంత్రిత్వ శాఖల వారి దృష్టికి తీసుకువెళ్లినట్టు పరిశ్రమ సభ్యులకు తెలియజేశారు. పరిశ్రమల సభ్యులకు మంత్రిత్వ శాఖ నుండి అవసరమైన సహకారం ఉంటుందని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు ఏదైనా సహాయం కోసం టాస్క్‌ఫోర్స్‌తో సంప్రదించాలని సభ్యులందరికీ సూచించారు.