జూలైలో ఇంటర్నేషనల్ క్రికెట్ ప్రారంభం??

కరోనా కారణంగా నిరవధికంగా వాయిదా పడిన అంతర్జాతీయ క్రికెట్ మళ్లీ జూలైలో మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం కొన్ని దేశాల్లో కోవిడ్ 19 అదుపులోకి వస్తుండడంతో ఐసీసీ, ఆయా దేశాల బోర్డులు క్రికెట్‌కు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వాలని భావిస్తున్నాయి. అధికారిక ప్రకటన రాకున్నా.. ఇంగ్లాండ్, వెస్టిండీస్ మధ్య జూలైలో టెస్ట్ సిరీస్ జరగడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే అభిమానులు లేకుండానే ఈ సిరీస్ నిర్వహించేందుకు ఇంగ్లాండ్ సిద్ధమైంది. మూడు టెస్టుల సిరీస్‌ను వేదికల్లోనే నిర్ణయించేలా షెడ్యూల్ రూపొందించినట్లు సమాచారం. కరోనా వైరస్ ప్రమాద పూర్తిస్థాయిలో తగ్గకపోవడంతో ఖాళీ స్టేడియాల్లోనే మ్యాచ్‌లు నిర్వహించాలని ఇరుదేశాల బోర్డులు అంగీకారానికి వచ్చాయి.