ఐపీఎల్‌ 2020 షెడ్యూల్‌ వచ్చేసిందోచ్‌

*ఐపీఎల్‌ 2020 షెడ్యూల్‌ వచ్చేసిందోచ్‌**

*ప్రతి ఆదివారం రెండేసి మ్యాచ్‌లు*

ఐపీఎల్‌ 13వ సీజన్‌ పూర్తి షెడ్యూల్‌ వచ్చేసింది. వివరాలను ఐపీఎల్‌ నిర్వాహకులు అధికారిక వెబ్‌సైట్‌లో వెల్లడించారు. గతేడాది ఫైనల్‌కు చేరిన ముంబయి ఇండియన్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్ల మధ్య మార్చి 29న వాంఖడేలో తొలి మ్యాచ్‌ జరగనుంది. రెండో మ్యాచ్‌ 30న దిల్లీ క్యాపిటల్స్‌, కింగ్స్‌ XI పంజాబ్‌ జట్ల మధ్య, 31న రాయల్‌ ఛాలెంజర్స్‌, కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ మధ్య జరగనుంది.
ఇక సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తొలి మ్యాచ్‌  ముంబయి ఇండియన్స్‌తో ఏప్రిల్‌ 1న ఆడనుంది. మొత్తం 56 మ్యాచ్‌లు జరగనుండగా అందులో ప్రతీ ఆదివారం రెండేసి మ్యాచ్‌లు నిర్వహించనున్నట్లు షెడ్యూల్లో ప్రకటించింది. గతేడాది హైదరాబాద్‌లో జరిగిన ఫైనల్లో ముంబయి ఇండియన్స్‌ ఒక్క పరుగుతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో ముంబయి నాలుగోసారి టైటిల్‌ సాధించి చరిత్ర సృష్టించింది.