కరోనా కట్టడికి IPS అధికారుల విరాళం

తెలంగాణలోని IPS అధికారులు ముఖ్యమంత్రి సహాయ నిధికి ఓ నెల జీతం విరాళంగా ప్రకటించారు. కరోనా కట్టడికి తమ వంతు సహాయంగా IPS అధికారుల తరపున DGP మహేందర్ రెడ్డి ఈ చెక్ ప్రతిని సీఎం కేసీఆర్ కు అందజేసారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఈ నిర్ణయంపై DGPని అభినందించారు.