కరోనా యాంటీబాడీ అభివృద్ధిలో ముందడుగేసిన ఇజ్రాయెల్

కరోనా యాంటీబాడీని అభివృద్ధి చేయడంలో పురోగతి ఇజ్రాయెల్ బయోలాజికల్ ఇన్స్టిట్యూట్ సాధించింది. కరోనా యాంటీబాడీని అభివృద్ధి చేయడంలో దేశ జీవ పరిశోధన సంస్థ గణనీయమైన పురోగతి సాధించినట్లు ఇజ్రాయెల్ రక్షణ మంత్రి నాఫ్తాలి బెన్నెట్ వెల్లడించారు.

కరోనా యాంటీబాడీ అభివృద్ధి దశలో వైరస్ మహామ్మారిపై దాడి చేసి శరీరంలో తటస్థీకరిస్తున్న టీకా పూర్తవుతుందని ఇజ్రాయెల్ చెబుతోంది. ఏదేమైనా ప్రపంచంలో ఎవరో ఒకరు ఎదోక దేశం మందు, వ్యాక్సిన్ కనబడితే చాలని యావత్ విశ్వంలోని జనమంతా ప్రార్థిస్తున్నారు.