అంతరాష్ట్ర రాకపోకలపై మార్గదర్శకాలు జారీ

ఆంధ్రప్రదేశ్ సర్కారు అంతరాష్ట్ర రాకపోకలపై మార్గదర్శకాలు జారీ చేసింది. ఏపీలో వివిధ రాష్ట్రాలకు చెందిన వలస కూలీలను తరలించేందుకు శ్రామిక్ రైళ్లను వినియోగిస్తున్నట్టు వెల్లడించింది. ప్రభుత్వ రిలీఫ్ క్యాంపుల్లో ఉన్న వారిని ఆయా రాష్ట్రాల అనుమతులతో శ్రామిక్ రైళ్ల ద్వారా పంపనున్నట్టు తెలిపింది. శ్రామిక్ రైళ్లల్లో వెళ్లే వారికి ప్రయాణ ఖర్చులు, భోజన వసతి కల్పించనున్న ప్రభుత్వం భరించి, రిలీఫ్ క్యాంపుల నుంచి రైల్వే స్టేషన్లకు ఆర్టీసీ బస్సుల ద్వారా తరలింపు చేయనుంది.ప్రభుత్వ రిలీఫ్ క్యాంపుల్లో ఉన్నటువంటి అలాగే లేని వలస కార్మికులు స్వస్థలాలకు తరలివెళ్లాలనుకుంటే స్థానిక ప్రభుత్వ యంత్రాంగం దృష్టి తీసుకెళ్లాలని, అత్యవసర సమయాల్లో తప్ప వ్యక్తిగతంగా రాకపోకలకు అనుమతి నిరాకరిస్తున్నామని సర్కారు తెలిపింది. ప్రభుత్వం నుంచి అనుమతి పొందిన ప్రైవేట్ కంపెనీలు జారీ చేసే ధృవ పత్రాలతో ప్రైవేట్ ఉద్యోగులు రాకపోకలు సాగించవచ్చన్న ప్రభుత్వం ప్రకటించింది.