ఉద్యోగులకు శాశ్వతంగా వర్క్ ఫ్రం హోం ఇస్తున్న ఐటి దిగ్గజ సంస్థ

ఉద్యోగులకు శాశ్వతంగా వర్క్ ఫ్రం హోం ఇస్తున్న ఐటి దిగ్గజ సంస్థ

ఉద్యోగులు కరోనా బారిన పడకుండా ప్రముఖ సంస్థలు వర్క్ ఫ్రం హోం అవకాశాన్ని కల్పిస్తోన్న విషయం తెలిసిందే. అయితే, కరోనా తగ్గితే తిరిగి ఉద్యోగులను కార్యాలయాలకు రమ్మని పిలవాలని భావిస్తున్నాయి. ప్రముఖ ఐటీ సంస్థ మైక్రోసాఫ్ట్‌ మాత్రం తమ కంపెనీల్లో పనిచేస్తోన్న  హార్డ్‌వేర్‌ ల్యాబ్స్‌, డేటా సెంటర్లు, శిక్షణా కార్యక్రమాల్లో పాల్గొనే ఉద్యోగులు మినహా ఇతర ఉద్యోగులు ఇకపై శాశ్వతంగా వర్క్ ఫ్రం హోం చేసుకోవచ్చని తెలిపింది.సగం కానీ, అంతకంటే తక్కువ పనిదినాల్లో కానీ ఈ వర్క్ ఫ్రం హోం ఇస్తామని వివరించింది. ఆయా విభాగాల మేనేజర్లతో ఉద్యోగులు చర్చించి నిర్ణయం తీసుకోవాలని చెప్పింది. వర్క్ ఫ్రం హోం నేపథ్యంలో ఉద్యోగులు వారి నివాస స్థలాల్ని కూడా మార్చుకునే అవకాశం ఇస్తున్నట్లు తెలిపింది. అమెరికాలో వారి సొంత ప్రదేశాలకు వెళ్లి పనిచేసుకోవచ్చని, అలాగే, విదేశీయులు తమ సొంత దేశాలకు కూడా వెళ్లి పనిచేసుకోవచ్చని ఆఫర్ ఇచ్చింది. అయితే, వేతనాల్లో కాస్త మార్పులు ఉంటాయని తెలిపింది. ఇందుకోసం మేనేజర్ నుంచి‌ అనుమతి తప్పనిసరి తీసుకోవాలని చెప్పింది.