డాక్టర్లు తీవ్రంగా శ్రమించినా ఎస్పీ బాలును కాపాడలేకపోవడం దురదృష్టకరం: సీఎం కేసీఆర్

డాక్టర్లు తీవ్రంగా శ్రమించినా ఎస్పీ బాలును కాపాడలేకపోవడం దురదృష్టకరం: సీఎం కేసీఆర్

గానగంధర్వుడు, సినీ సంగీతాన్ని తన గాత్రంతో మరోస్థాయికి తీసుకెళ్లిన గాయక దిగ్గజం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఈ లోకాన్ని విడిచి వెళ్లడంపై తెలంగాణ సీఎం కేసీఆర్ స్పందించారు. డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బంది తీవ్రంగా ప్రయత్నించినా, తమ అత్యుత్తమ సేవలు అందించినా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంను కాపాడలేకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు.బాలు సినీ ప్రపంచంలో గాయకుడిగా, సంగీత దర్శకుడిగా, నటుడిగా అత్యుత్తమ రీతిలో సేవలందించారని కొనియాడారు. ఆయన మరణంతో ఏర్పడిన శూన్యాన్ని భర్తీ చేయడం సాధ్యం కాదని అభిప్రాయపడ్డారు. ఈ విషాద సమయంలో బాలు కుటుంబ సభ్యులకు సంతాపం వ్యక్తం చేస్తున్నట్టు సీఎం కేసీఆర్ ఓ ప్రకటనలో తెలిపారు.