కరోనాతో IT ఉద్యోగాలు వర్క్ ఫ్రమ్ హోం.

కరోనాతో IT ఉద్యోగాలు వర్క్ ఫ్రమ్ హోం.

కరోనా ప్రభావం ప్రపంచంలోని అన్ని దేశాలను గడగడలాడిస్తోంది. ఓవైపు ఆర్థిక ఇబ్బందులు మరోవైవు ఆరోగ్య అవస్థలు ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని ప్రపంచంలోని సాఫ్ట్ వేర్ దిగ్గజ కంపెనీలు గూగుల్, మైక్రోసాఫ్ట్, క్వాల్ కామ్ లాంటి మల్టీ నేషనల్ ఐటీ కంపెనీలు ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ కోసం అనుమతులు ఇచ్చాయి.
సోమవారం నుంచే సైబరాబాద్ పరిధిలోని గచ్చిబౌలి, కొండాపూర్, మాదాపూర్ లోన్న సాఫ్ట్ వేర్ కంపెనీలు
ఈ విధానాన్ని అమలు చేస్తున్నాయి. హైటెక్ సిటీ పరిసరాల్లో దాదాపు 1000 వరకూ ఐటీ, బీపీఓ కంపెనీలున్నాయి.
అందులో 7 లక్షల వరకూ ఐటీ నిపుణులు పని చేస్తున్నారు.
అంతేకాకుండా మరికొన్ని కంపెనీల్లో థర్మల్ స్క్రీనింగ్ తర్వాతే
ఉద్యోగులను ఆఫీస్ లోపలికి అనుమతి ఇస్తున్నాయి. జ్వరం, దగ్గు లక్షణాలు వెంటనే సెలవులు లేదంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అనుమతులు ఇవ్వడం జరుగుతోంది.