కరోనా మృత్యుంజయ క్రీడాకారుడు

నోవ‌ల్ క‌రోనా వైర‌స్‌తో పోరాడి మృత్యుంజ‌యునిగా నిలిచాడు ఓ ఫుట్‌బాల్ క్రీడాకారుడు. ఆ క్రీడాకారుడిలోని రోగ‌నిరోధ‌క శ‌క్తి ముందు క‌రోనా వైర‌స్‌కు త‌ల‌వంచ‌క త‌ప్ప‌లేదు. క‌రోనా వైర‌స్‌తో ప్ర‌పంచ వ్యాప్తంగా వేల సంఖ్య‌లో జ‌నాలు మృత్యువాత ప‌డ‌గా ల‌క్ష‌ల సంఖ్య‌లో మృత్యువుతో పోరాడుతున్నారు. యూర‌ప్ ఖండంలోని ఇట‌లీలో అయితే క‌రోనా వైర‌స్ మ‌ర‌ణ మృదంగం మ్రోగిస్తోంది. ఆ దేశంలో క‌రోనా వైర‌స్ సంక్ర‌మించి మృతి చెందిన వారి సంఖ్య 9వేలు దాటింది. ఇట‌లీ ప్రొఫెష‌న‌ల్ అసోసియేష‌న్ ఆఫ్ ఫుట్‌బాల్ క్ల‌బ్ ల‌లో ఒక‌టైనా జువెన్‌ట‌స్ జ‌ట్టు స‌భ్యుడు, అర్జెంటీనా క్రీడాకారుడు పౌలో డైబ‌లా క‌రోనా వైర‌స్ బారిన ప‌డి మృత్యువుతో పోరాడి ప్రాణాల‌తో బ‌తికి బ‌య‌ట‌ప‌డ్డాడు. ఆ క్ల‌బ్ నుంచి ఆడుతున్న ఫుట్ బాల్ క్రీడాకారుల్లో పౌలో డైబ‌లా తోపాటు డానియెల్ రుగాని, , బ్లాసి మాటుడిలు క‌రోనా వైర‌స్ బారిన ప‌డ్డారు. అయితే పౌలో మాత్రం మృత్యుంజ‌యునిగా నిలిచాడు. క‌రోనా వైర‌స్‌తో న‌ర‌కం చూసిన‌ట్టు త‌న అనుభ‌వాల‌ను పంచుకున్నాడు.